Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో ఐదు మృతదేహాలు వెలికితీత

నాంపల్లిలోని ఫర్నిచర్​ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముగిశాయి. 22 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. .. .. ..

Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో ఐదు మృతదేహాలు వెలికితీత
Nampally Fire Accident

Updated on: Jan 25, 2026 | 12:53 PM

22గంటల రెస్క్యూ ఆపరేషన్‌కి ఎండ్ కార్డ్ పడింది. నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. ఇందులో ఇద్దరు చిన్నారులుండటం అందరినీ కలచి వేస్తుంది.  బీబీ, ఇంతియాజ్‌, హబీబ్‌‌లతో పాటు చిన్నారులు ప్రణీత్, అఖిల్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

నాంపల్లి అగ్నిప్రమాదం మంటలు చల్లారాయి. భవనంలో చిక్కుకున్న ఐదుగురు మృతదేహాలు వెలికి తీశారు. శనివారం మధ్యాహ్నం ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. 22గంటలకు పైగా సెల్లార్‌లో చిక్కుకుని ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు అఖిల్‌, ప్రణీత్‌ ఉన్నారు. మరో ముగ్గురు హబీబ్‌, ఇంతియాజ్, బేబీగా గుర్తించారు. గుర్తుపట్టలేని స్థితిలో ఐదుగురి మృతదేహాలున్నాయి. ఉస్మానియా మార్చురీకి మృతదేహాల తరలించారు. DNA టెస్టుల తర్వాత మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

బిల్డింగ్ ఓనర్, ఫర్నిచర్ షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ వినియోగిస్తున్నారని, మ్యాట్రెస్ తయారీ మెటీరియల్స్, రెగ్జిన్ సెల్లార్‌లో ఉంచారని తెలిపారు. ఒక ఫ్యామిలీకి కూడా సెల్లార్‌లో అకాంబిడేషన్ ఇచ్చారన్నారు. పార్కింగ్‌ కోసం ఉండే సెల్లార్ ఇలా వినియోగించడంపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.