Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వర్సెస్‌ బ్యానర్‌ ఫైట్‌.. ఒకరు స్వాగతిస్తే మరొకరు ప్రశ్నిస్తున్నారు.. 17 ప్రశ్నలతో 17 బ్యానర్లు..

| Edited By: Ravi Kiran

May 26, 2022 | 1:13 PM

ప్రధాని మోదీ రాకను స్వాగతిస్తూ బీజేపీ శ్రేణులు బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు నగర యువత పేరుతో మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ బ్యానర్లు ఏర్పాటు వెలిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 బ్యానర్లు ఇలా కట్టారు. వాటిలో పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వర్సెస్‌ బ్యానర్‌ ఫైట్‌.. ఒకరు స్వాగతిస్తే మరొకరు ప్రశ్నిస్తున్నారు.. 17 ప్రశ్నలతో 17 బ్యానర్లు..
Pm Modi
Follow us on

హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వర్సెస్‌ బ్యానర్‌ ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రధాని మోదీ(PM Modi) రాకను స్వాగతిస్తూ బీజేపీ శ్రేణులు బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు నగర యువత పేరుతో మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ బ్యానర్లు ఏర్పాటు వెలిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 బ్యానర్లు ఇలా కట్టారు. వాటిలో పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఇదే టైమ్‌లో సీఎం కేసీఆర్‌ బెంగళూరు వెళుతున్నారు. అయితే, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉండరని వార్తలు రావడంతో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారంటూ మండిప‌డింది బీజేపీ.

అయితే.. జేడీఎస్‌ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం 1 గంటకు నిమిషాలకి బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. 1.45 ని.లకు యిర్ పోర్టు పార్కింగ్‌లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు. 1.50 నిమిషాలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ హెలిప్యాడ్‌కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గచ్చిబౌలి ISBకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు వెళ్తారు. 4 .15కు బేగంపేట నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం బెంగళూరు పయనమవుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీకానున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి లీలా ప్యాలెస్‌‌‌‌ హోటల్‌‌‌‌కు వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12.30కు మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకుంటారు. దేవెగౌడ, కుమారస్వామితో కలిసి లంచ్‌‌‌‌ చేస్తారు. తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని టూర్‌కి సీఎం దూరంగా ఉండటం ఇది మూడోసారి. 2020, నవంబరు 28న ప్రధాని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఆ సమయంలో మోదీకి స్వాగతం పలకలేదు సీఎం కేసీఆర్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే ప్రధాని హైదరాబాద్‌ వచ్చారని టీఆర్‌ఎస్‌ విమర్శించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న హైదరాబాద్‌కు వచ్చారు ప్రధాని. ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి మోదీ తెలంగాణకు వస్తుండగా.. సీఎం మాత్రం బెంగళూరు వెళ్తున్నారు.