ఫ్రీ వైఫై.. గొడవలకు ఊర్లోనే పరిష్కారాలు.. 12 ఆణిముత్యాలతో బంపర్ ఆఫర్..

తెలంగాణ రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. స్థానిక సంస్థలతోఎన్నికలతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్‌గా ఎలాగైనా గెలిచేందుకు గ్రామస్తులకు తాయిలాలు, వినూత్న రీతిలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే 12 ఆణిముత్యాల బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఆ ఆణిముత్యాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఫ్రీ వైఫై.. గొడవలకు ఊర్లోనే పరిష్కారాలు.. 12 ఆణిముత్యాలతో బంపర్ ఆఫర్..
Local Body Polls

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 01, 2025 | 1:22 PM

తెలంగాణ రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. స్థానిక సంస్థలతోఎన్నికలతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్‌గా ఎలాగైనా గెలిచేందుకు గ్రామస్తులకు తాయిలాలు, వినూత్న రీతిలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే 12 ఆణిముత్యాల బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఆ ఆణిముత్యాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌పురం గ్రామం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో 1400 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన రేణుక, మల్లేష్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ముగ్గురు పిల్లలు ఉండడంతో గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. మల్లేష్ కేబుల్ ఆపరేటర్ గా గ్రామంలో మంచి గుర్తింపు ఉంది. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకోవాలంటూ రేణుక, మల్లేష్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.

12 ఆణిముత్యాలు..

రేణుక సర్పంచ్ అభ్యర్థిగా తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘మన గ్రామానికి 12 ఆణిముత్యాలు” పేరుతో విడుదలైన మేనిఫెస్టో గ్రామ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవేంటో చూద్దాం..

1) ప్రతి శుక్రవారం “గ్రామ అభివృద్ధి కమిటీ”తో సమావేశం.

2) ప్రభుత్వ పాఠశాల బలోపేతం

3) ప్రతి వార్డును ప్రత్యేక అభివృద్ధి జోన్‌గా మార్చడం

4) గ్రామ శాంతి కమిటీ చిన్న వివాదాలు పెద్దలతో గ్రామంలోనే శాంతియుత పరిష్కారం.

5) రాజకీయ రంగులు లేని పంచాయతీ పాలన

6) ప్రతి మూడు నెలలకు మెగా హెల్త్ క్యాంపులు

7) స్ట్రీట్ లైట్లు – CCTV – Wi-Fi ఏర్పాటు

8) రహదారుల అభివృద్ధి

9) చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి

10) పింఛన్లు – ఇండ్ల స్థలాలు లేని అర్హులందరికీ న్యాయం

11)వ ఆణిముత్యం — 28 ఏళ్ల సేవా అనుభవం

12)వ ఆణిముత్యం — స్వార్థం లేని నిజాయితీ నాయకత్వం వంటి అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయి.

Nalgonda Polls

తమ హామీలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నామని, ఎన్నికల్లో ఎలాంటి మద్యం, డబ్బులు పంపిణీ చేసేది లేదని రేణుక మల్లేష్ స్పష్టం చేస్తున్నారు. నీతి నిజాయితీ, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరుతున్నామని చెబుతున్నారు.. ఎవరు గెలుస్తారో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..