Nagarkurnool Election Result 2023: నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలో ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో..?

Nagarkurnool Assembly Election Result 2023 Live Counting Updates: కూచుకుల్ల దామోదర్ రెడ్డి గతంలో నాలుగుసార్లు నాగం చేతిలో ఓడిపోయారు. వారిద్దరి మధ్య చిరకాల రాజకీయ వైరం ఉంది. ఈ సారి ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో నాగం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. ఆయన చేరికతో నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ మరింత బలం పుంజుకుందని.. మర్రి జనార్ధన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి విజయం తథ్యమని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

Nagarkurnool Election Result 2023: నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలో ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో..?
Nagarkurnool

Edited By:

Updated on: Dec 03, 2023 | 9:51 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొంటోంది. అలా బిగ్ ఫైట్ నెలకొంటున్న నియోజకవర్గాల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం (Nagarkurnool Assembly Election) కూడా ఒకటి. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్ పేరు మారింది) అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి ఈ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఆయన ఇక్కడి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో సీనియర్ నాయకుడైన నాగం.. తెలంగాణ ఉద్యమానికి జై కొట్టి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్ధన్ రెడ్డి 14,435 ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచారు. నాటి ఎన్నికల్లో మర్రి జనార్ధన్ రెడ్డికి 62,470 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుల్ల దామోదర్ రెడ్డికి 48,035 ఓట్లు దక్కాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డికి 27,789 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి 54,354 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో మర్రి జనార్ధన్ రెడ్డికి 102,493 ఓట్లు రాగా.. నాగం జనార్ధన్ రెడ్డి (కాంగ్రెస్)కి 48,139 ఓట్లు దక్కాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 2,02,218 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మర్రి జనార్ధన్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూచుకుల్ల రాజేశ్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్ రెడ్డి కొన్ని నెలల క్రితం ఆ పార్టీని వీడి సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరి టికెట్ సాధించారు.

కూచుకుల్ల దామోదర్ రెడ్డి గతంలో నాలుగుసార్లు నాగం చేతిలో ఓడిపోయారు. వారిద్దరి మధ్య చిరకాల రాజకీయ వైరం ఉంది. ఈ సారి ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో నాగం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. ఆయన చేరికతో నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ మరింత బలం పుంజుకుందని.. మర్రి జనార్ధన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి విజయం తథ్యమని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్