మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. క్రిమినల్‌ డిఫమేషన్‌ ప్రూవ్‌ అయితే

|

Oct 09, 2024 | 11:44 AM

కేసు నిలబడాలంటే సాక్ష్యం అవసరం. సాక్ష్యం ఎంత బలంగా ఉంటే...కేసులో విజయం సాధించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కొండా సురేఖ మీద నాగార్జున వేసిన కేసులో సాక్ష్యాల మాటేంటి? అవి ఎంత బలంగా ఉన్నాయి? ఇరుపక్షాల లాయర్లు ఏమంటున్నారు?

మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. క్రిమినల్‌ డిఫమేషన్‌ ప్రూవ్‌ అయితే
Nagarjuna Vs Konda Surekha
Follow us on

కోర్టులో కేసు గెలవాలంటే సాక్ష్యాలు, ఆధారాలతో పాటు లాయర్ల వాదనా పటిమ కూడా ముఖ్యమే. కేటీఆర్‌తో పొలిటికల్‌ ఫైట్‌లోకి సమంత, నాగ చైతన్య విడాకుల మేటర్‌ని కూడా తీసుకొచ్చి రచ్చ చేశారు మంత్రి కొండా సురేఖ. దీంతో నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు వేశారు నాగార్జున. కొండా కామెంట్లతో తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందని, తమ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు నాగ్. కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్‌ చేసింది.

ఆ తర్వాత ఈ కేసులో ఫస్ట్‌ విట్‌నెస్‌గా సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది కోర్టు. ఈ నెల 10న రెండో సాక్షిగా వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్‌ని రికార్డు చేయనున్నారు. క్రిమినల్ డిఫమేషన్‌ కేసు ప్రూవ్‌ అయితే కొండా సురేఖకు రెండేళ్ల వరకు కఠిన శిక్ష తప్పదంటున్నారు నాగార్జున లాయర్‌. కొండా సురేఖ తన స్టేట్‌మెంట్‌ని వ్యతిరేకించడం లేదు కాబట్టి, కేసు ప్రూవ్‌ అయినట్లే అంటున్నారు నాగ్ లాయర్‌. కొండా సురేఖ చెప్పిన సారీని.. ఒప్పుకొవడం లేదా తిరస్కరించడం పూర్తిగా పిటిషనర్ అయిన నాగార్జున మీదే ఆధారపడి ఉంటుందని , కోర్టు వారు దీనిలో జోక్యం చేసుకొరని లాయర్ వెల్లడించారు.

ఇక కొండా సురేఖ లాయర్‌ ఆర్గ్యుమెంట్‌ మరో విధంగా ఉంది. నాగార్జున వేసిన కేసు నిలబడదంటున్నారు ఆమె అడ్వొకేట్‌. వాంగ్మూలాల్లో తేడాలున్నాయంటున్నారు ఆయన. నాగార్జున పిటిషన్‌లో ఒకటి చెప్పారని, స్టేట్‌మెంట్‌లో మరొకటి చెప్పారంటున్నారు కొండా లాయర్‌ తిరుపతి వర్మ. సుప్రియ చేత ఉద్దేశపూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించారని, కొండా తరఫు న్యాయవాది చెబుతున్నారు. ఈ కేసులో ఇరు పక్షాల లాయర్ల వాదనలతో…నెక్ట్స్‌ ఏంటనే ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి