Nagarkurnool: ఉన్నఫలంగా రైతు పొలంలో ల్యాండ్ అయిన విచిత్ర బెలూన్.. దానిలో ఏముంది.. అధికారులు ఏం చెప్పారంటే..?

నాగర్‌కర్నూలు జిల్లాలో బెలూన్‌ కలకలం చెలరేగింది. రైతు పొలంలో పడిపోయిన భారీ బెలూన్‌‌ను చూసి.. స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Nagarkurnool: ఉన్నఫలంగా రైతు పొలంలో ల్యాండ్ అయిన విచిత్ర బెలూన్.. దానిలో ఏముంది.. అధికారులు ఏం చెప్పారంటే..?
Mysterious Balloon

Updated on: Feb 20, 2023 | 12:20 PM

స్పై…బెలూన్స్‌…! ఈ మధ్య తరచూగా ఇదే పేరు వినిపిస్తోంది. చైనా స్పై బెలూన్లతో అగ్రరాజ్యలైన అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలే వణుకుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశంలో బెలూన్స్‌ కనిపిస్తే…జనం భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నాగర్‌కర్నూలుజిల్లాలో జరిగింది.

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ భారీ బెలూన్‌ పడిపోయింది. కృష్ణారెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో బెలూన్‌ పడిపోవడంతో స్థానిక ప్రజలు, రైతులు భయాందోళనకు గురయ్యారు.

బెలూన్‌ పడిపోయిన ప్రాంతానికి కాసేపటికే..భారత పరిశోధన సంస్థ TIFR అధికారులు, సైంటిస్టులు అక్కడికి వచ్చారు. వాతావరణంలో మార్పులు, నక్షత్రాలపై పరిశోధన కోసం ఉపయోగించే సైన్స్ ఫిట్‌ బెలూన్‌నని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం రాత్రి 11 గంటలకు పరిశోధన ప్రారంభించామని, దాదాపు ఆకాశంలో 32 కిలోమీటర్లు పైకి వెళ్లిన తర్వాత కావాల్సిన డేటా తీసుకొని రిమూవ్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పరిశోధన బెలూన్‌లను దాదాపు 500 వరకు ప్రయోగించామని, వీటివల్ల ప్రాణహాని ఉండదని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం