My Home Group:పేద విద్యార్థులకు అండగా ‘మై హోమ్ గ్రూప్‌’.. సకల సౌకర్యాలతో సర్కారీ స్కూల్‌ కొత్త భవనం

|

Jan 08, 2024 | 8:43 PM

పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వసతులు కల్పించాలని సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ, నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇవ్వనుంది. ఖుషి ఫౌండేషన్‌ తో చేతులు కలిపి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్‌ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది.

My Home Group:పేద విద్యార్థులకు అండగా మై హోమ్ గ్రూప్‌.. సకల సౌకర్యాలతో సర్కారీ స్కూల్‌ కొత్త భవనం
Government School New Building
Follow us on

పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వసతులు కల్పించాలని సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ, నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇవ్వనుంది. ఖుషి ఫౌండేషన్‌ తో చేతులు కలిపి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్‌ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచింతల్ గ్రామంలో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా అందించేందుకు హంగు ఆర్భాటాలతో ముస్తాబయింది. దీనిని టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మై హోం గ్రూప్స్, ఖుషి ఫౌండేషన్ సంస్థ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఫౌండేషన్ ఎన్జీవో కో ఆర్డినేటర్ మానస మాట్లాడుతూ ‘ముచ్చింతల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ తరుణంలో మై హోమ్ గ్రూప్ సంస్థతో తాము కలిసి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించింది. ఇప్పుడు విద్యార్థులకు ఈ భవనంలో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. విద్యార్థులు నేర్చుకునేందుకు అన్ని రకాల వసతులతో కంప్యూటర్ ల్యాబ్‌ ను కూడా ఏర్పాటు చేశాం . ఇప్పుడు గ్రామంలో స్కూల్‌ భవనాన్ని చూసి అనేకమంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మై హోమ్ గ్రూప్ సంస్థ కు స్థానికులు ఎంతో కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలుపుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Government School New Building

తమ గ్రామంలో పేద విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాల నూతన భవనాన్ని నిర్మించి ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నానని గ్రామ సర్పంచ్ సుజాత చంద్రయ్య తెలిపారు. గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించడం మైహోం గ్రూప్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారాయన. మరోవైపు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పాఠశాల భవనాని చూసిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు నూతన భవనంలో చదువుకుంటామని ఎదురుచూస్తున్నామన్నారు విద్యార్థులు. తమను దృష్టిలో పెట్టుకుని పాఠశాల భవనం నిర్మించి ఇవ్వడం మైహోం సంస్థ కు ధన్యవాదాలు తెలిపారు స్టూడెంట్స్‌.

మై హోమ్ గ్రూప్ కట్టించిన ప్రభుత్వ పాఠశాల కొత్త భవనం ఇదిగో.. వీడియో ..

 

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.