Munugode Congress: మునుగోడు కాంగ్రెస్‌లో ముదిరిన ముసలం.. కోమటిరెడ్డికి ఆ ఇద్దరు సహకరిస్తారా..?
తెలంగాణ రాజకీయాలను మునుగోడు నియోజక వర్గం హీటెక్కిస్తోంది. మొన్న ఉపఎన్నికతో.. నేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇదంతా కూడా సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభకు ముందు రోజు జరిగిపోయింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా హాట్ టాపిక్ అయ్యింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నారు. రాత్రి రాత్రే వారు వీరు.. వీరు వారవుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం.. మునుగోడు నుంచి పోటీ చేస్తామని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీంతో మునుగోడు కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ టికెట్ హామీ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే మునుగోడు టికెట్ ఆశిస్తున్న చల్లమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిల పరిస్థితి ఏంటి..? అన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. కోమటిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి సహకరిస్తారా..? ఇంతకు మునుగోడు కాంగ్రెస్ లో ఏం జరుగుతోందన్న ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాజకీయాలను మునుగోడు నియోజక వర్గం హీటెక్కిస్తోంది. మొన్న ఉపఎన్నికతో.. నేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇదంతా కూడా సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభకు ముందు రోజు జరిగిపోయింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా హాట్ టాపిక్ అయ్యింది. 2018 ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 15నెలల క్రితం కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. దీంతో అనివార్యంగా వచ్చిన ఎన్నికలో బీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేసి 23 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
తాజాగా మునుగోడు ప్రజల అభీష్టం మేరకే తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు బరిలో ఉంటానని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. అనూహ్య పరిణామాలు ఏర్పడితే తప్ప మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగా మారింది. అయితే ఈయనకే టికెట్ ఇస్తారా? లేదా పార్టీ తరఫున దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తారనే దానిపైనా జోరుగా చర్చ సాగుతోంది.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే పార్టీ రెండో జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ టికెట్‌ను పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాస్ ఆశిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిన పాల్వాయి స్రవంతి.. ఈసారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. తన తండ్రితో హై కమాండ్ నేతలకు ఉన్న సానిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని తన రాజకీయ భవిష్యత్తు తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కులను ఢిల్లీలో కలిసి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తరచు పార్టీలు మారతున్న వారికి టికెట్ ఇస్తే, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న వారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.
మరో ఆశావహు పున్నా కైలాస్ కూడా ఢిల్లీలో మకాం వేసి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికలో స్రవంతికి అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ నేతలను కోరుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడుగా కొనసాగుతున్న చల్లమల కృష్ణారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. కృష్ణారెడ్డి ప్రతిపాదించిన వ్యక్తులనే పార్టీ మండల అధ్యక్షులుగా ప్రకటించారు. ప్రచార రథాలతో రెండు నెలలుగా నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాకతో ఆయన పరిస్థితి ఏంటనేది ప్రశ్నర్థికంగా మారింది. తన అనుచరులతో సమావేశాలు నిర్వహించిన కృష్ణారెడ్డి, టికెట్ తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశామని.. పార్టీ మారి వచ్చే వారికి టికెట్ ఇస్తే కార్యకర్తల ఆగ్రహానికి గురి కాక తప్పదని కృష్ణారెడ్డి హెచ్చరిస్తున్నారు.
మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత ఉన్న కైలాస్ కూడా ఢిల్లీ పెద్దలతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకను ఆహ్వానిస్తున్నానని, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న తన లాంటి బీసీ నేతకు ఇక్కడ అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేసి, మునుగోడులో.. బీసీ నేతగా తనకు మద్దతు పలకాలని ఆయన కోరుతున్నారు. అంతిమంగా పార్టీ తీసుకుని నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని పున్నా కైలాష్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే మునుగోడు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిలతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం. వారిద్దరితో సయోధ్య కుదిరిన తర్వాతనే ఇక్కడి పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ పెద్దలు చెబుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థి అయ్యే పక్షంలో సీపీఐ పోటీని సైతం ఉపసంహరిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే కృష్ణారెడ్డి మాత్రం పార్టీలో ఉంటూ టికెట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…