Munugode ByPoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్.. పేరు ఖరారు చేసిన పార్టీ హైకమాండ్..

Munugode ByPoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది. ముందునుంచీ ఎవరా? ఎవరా? అనుకున్నంటున్న అభ్యర్థి పేరు బయటకు రానే వచ్చింది.

Munugode ByPoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్.. పేరు ఖరారు చేసిన పార్టీ హైకమాండ్..
Palvai Sravanthi

Updated on: Sep 09, 2022 | 1:12 PM

Munugode ByPoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది. ముందునుంచీ ఎవరా? ఎవరా? అనుకున్నంటున్న అభ్యర్థి పేరు బయటకు రానే వచ్చింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ముకుల్ వాస్నిక్ పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి పేరును ఖరారు చేశారని, మునుగోడు బైపోల్‌లో ఆమె పోటీ చేయనున్నారని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇప్పటి వరకు పార్టీ శ్రేణుల్లో ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోయినట్లు అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ అభ్యర్థి ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీలో ఎవరిని దించాలా? అని రాష్ట్ర పార్టీ నేతలు సమాలోచనలు చేశారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైతే పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని భావించిన అధిష్టానం.. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి శ్రవంతిని, మునుగోడు బైపోల్‌లో నిలుపుతున్నట్లు ప్రకటించింది.

తాజాగా ప్రకటనతో అటు బీజేపీ అభ్యర్థి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరూ ఖరారైయ్యారు. ఇక అసలైన అధికార పార్టీ అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది. అయితే, అధికార టీఆర్ఎస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో గులాబీ దళపతి, సీఎం కే. చంద్రశేఖర్ రావు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మునుపటి ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే టీఆర్ఎస్ క్యాండిడేట్‌గా వినిపిస్తోంది. అయితే, ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తుండటంతో.. అధిష్టానం కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది. చూడాలి మరి టీఆర్ఎస్ నుంచి మునుగోడు బరిలో ఎవరిని నిలుపుతారో.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..