ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరు.. సీబీఐ దాడిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత

|

Apr 01, 2021 | 6:44 PM

ఢిల్లీలో తెలంగాణ ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. తన నివాసంలో సీబీఐ దాడులపై స్పందించారు టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత.

ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరు.. సీబీఐ దాడిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత
Mp Malothu Kavitha
Follow us on

TRS mp malothu kavitha: ఎంపీ, ఎమ్మెల్యేలకు సహాయకులమని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. డబ్బులు వసూలకు పాల్పడుతున్నవారిని పోలీసులు వేసిన వలకు మాత్రం చిక్కక తప్ప లేదు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. ఢిల్లీలోని ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అక్రమం అంటూ సదరు వ్యక్తి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుంటుండగా వారిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ.. ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటి యజమానిని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ.. ముగ్గురు వ్యక్తులు భవన యజమానిని బెదిరించారు. రూ. 5 లక్షలు ఇవ్వకుంటే.. అధికారులకు చెప్పి కూల్చి వేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. వల వేసిన సీబీఐ అధికారులు.. రాజీబ్ భట్టాచార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. బాధితుడు మన్మిత్‌సింగ్‌ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు.

ఇదిలావుంటే, ఢిల్లీలోని తన నివాసంలో సీబీఐ దాడులపై స్పందించారు టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత. ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరన్నారు మహబూబాబాద్‌ ఎంపీ కవిత. సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఒకరైన దుర్గేష్‌ తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారన్నారు. మిగిలిన వాళ్లెవరో తనకు తెలీదన్నారు.

తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి మాలోతు కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్‌ను పక్కనపెట్టి రెడ్యానాయక్ కూతురు కవితకు గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా, కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also…. మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. డాక్టర్ చీటీ లేకపోతే.. నో మెడిసిన్.!