ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీకి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎమ్మెల్యేకు ఐదు ఎస్కార్ట్‌లు అవసరమా అని ప్రశ్నించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత తగ్గితే.. తాండూరు లాంటి వివాదాలు తలెత్తుతాయన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందన్న ఆయన.. పోలీసులను బూతులు తిట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా..? డీజీపీ…ఉన్నా లేనట్లే అని అన్నారు. పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కి ఐదు ఎస్కార్ట్ వాహనాలు అవసరమా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులు వీటి మీద స్పందించాలి. పట్నం మహేందర్ బూతులు తిట్టారు తప్పే. కానీ పోలీసుల పద్దతి కూడా మారాలని సూచించారు.
అయితే తనపై ప్లాన్ ప్రకారం దాడి జరుగుతోందని అన్నారు పట్నం. తాండూరులో మొన్నసర్పంచ్‌ల తొలగింపు.. ఇవాళ ఆడియో రిలీజ్‌లు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. జరుగుతున్న వ్యవహారాలన్నింటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని బదులిచ్చారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
ఇదిలావుంటే.. తాండూర్ టికెట్‌పై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోటా పోటీ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ తనదేనన్నారు పట్నం. దీనికి కౌంటర్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి.. తాండూర్‌లో తన పనితీరుపై అటు ప్రజలు ఇటు పార్టీ అధిష్టానం సంతృప్తిగా ఉందని.. 100శాతం తనకే టికెట్ దక్కుతుందన్నారు.
ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?
Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!