Etela Rajender: దమ్మున్నోడు కావాలి.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుపొంది జోష్ లో ఉన్న కమలం పార్టీలో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న అంశంపై పార్టీ నేతలు ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. ఓవైపు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుండగా..

Etela Rajender: దమ్మున్నోడు కావాలి.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..
Etela Rajender

Edited By:

Updated on: Jun 23, 2024 | 2:55 PM

ఏ ఫైటర్ కావాలి.. స్ట్రీట్‌ఫైటరా.. రియల్ ఫైటరా.. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా.. అంటూ మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారన్న ఈటల.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అన్నారు.

ఈటల రాజేందర్ వీడియో చూడండి..

బీజేపీ కొత్త అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకొని వెళ్లే నేతను నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరిన నేపథ్యంలోనే.. ఇవాళ ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..