
Dharmapuri Srinivas Comments on his Political Life: రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్.. తన రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని.. కావాలంటే.. సీఎం కేసీఆర్‌ను అడగండి అంటూ ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానాలు రావడం లేదని.. తాను టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీనేనా.. అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలంటూ ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని తన నివాసంలో డి. శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం తన ఇష్టమంటూ అభిప్రాయపడ్డారు. మరో కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడని పేర్కొన్నారు. తన ఇద్దరు కొడుకులు తనకు రెండు కళ్లలాంటివారని పేర్కొన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా సమాజ సేవలో ఉండాలనే కోరుకుంటానని పేర్కొన్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో త్వరలో మీరే చూస్తారంటూ డి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఒకే ఇంట్లో మూడు పార్టీలున్నాయంటూ.. అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఒకే ఇంట్లో మూడూ పార్టీలున్నాయంటూ.. తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో, భర్త ఇంకో పార్టీలో ఉన్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గుర్తు చేశారు. పీసీసీ చీఫ్‌గా తాను కూర్చునే చక్రం తిప్పానని పేర్కొన్నారు. చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీలోకి వెళ్లినప్పుడు వ్యతిరేకించలేదని.. కష్టపడి గెలిచి ఎంపీ అయ్యాడంటూ పేర్కొన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ సైతం రాజకీయాల్లో ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Also Read: