Ayushman Bharat: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బండి సంజయ్.. ఆలస్యంగానైనా.. అంటూ ట్విట్

|

May 18, 2021 | 10:30 PM

Bandi Sanjay: ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్

Ayushman Bharat: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బండి సంజయ్.. ఆలస్యంగానైనా.. అంటూ ట్విట్
Bandi Sanjay Kumar
Follow us on

Bandi Sanjay: ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తాము వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి ఫలించిందని బండి సంజయ్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంలో చేరాలని ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ సంజయ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స చేయడంతో పాటు పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ మంగళవారం రాత్రి ట్విట్ చేశారు.

బండి సంజయ్ చేసిన ట్విట్..

Also Read:

Kerosene: కరోనా భయం.. కిరోసిన్ తాగిన యువకుడు.. ఆ తర్వాత ప్రాణాలతో పోరాడి..

Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..