Hyderabad News: కొడుకు కోసం పోరాటం..రెండు నెలల పసిగుడ్డును వదిలించుకున్న తల్లి, 14ఏళ్లుగా పెంచిన అమ్మ..

|

May 12, 2022 | 3:25 PM

ఆ దంపతులు పద్నాలుగు ఏళ్ల క్రితం ఓ బాబును దత్తత తీసుకున్నారు. ఇప్పుడు కన్నతల్లి మళ్లీ తన బాబు తనకు కావాలంటుంది.

Hyderabad News: కొడుకు కోసం పోరాటం..రెండు నెలల పసిగుడ్డును వదిలించుకున్న తల్లి, 14ఏళ్లుగా పెంచిన అమ్మ..
Adopted Son Issue
Follow us on

ఆ దంపతులు పద్నాలుగు ఏళ్ల క్రితం ఓ బాబును దత్తత తీసుకున్నారు. ఇప్పుడు కన్నతల్లి మళ్లీ తన బాబు తనకు కావాలంటుంది. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కన్న తల్లికి ఇవ్వాలంటున్నారు. పెంచిన తల్లి బాబు కోసం న్యాయపోరాటం చేస్తోంది.. న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది పెంచిన తల్లి. హైదరాబాద్ పటాన్ చెరుకు చెందిన దంపతులు రాజేష్, రమణమ్మ..వీరికి సంతానం లేకపోవడంతో.. అదే ప్రాంతానికి చెందిన శారదా అనే మహిళ వద్ద రెండు నెలల బాబు అఖిల్‌ను దత్తత తీసుకున్నారు. శారదా అనే మహిళ కొండల్ రావు అనే వ్యక్తితో సహజీవనం చేసింది. వివాహం కాకముందే బాబు పుట్టడంతో.. ఆ బాబును వదిలించుకునేందుకు రాజేష్, రమణమ్మ దంపతులకు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో దత్తత ఇచ్చారు. కొంతకాలం తర్వాత శారదా అనే మహిళ కొండల్ రావు ను వివాహం చేసుకుంది. అనంతరం 14 ఏళ్ల తన బాబును తనకు తిరిగి ఇచ్చేయాలని కన్నతల్లి శారదా, పెంచిన తల్లిదండ్రులను అడిగింది. వారు నిరాకరించడంతో.. స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కేసు దర్యాప్తు చేసి.. చట్ట పరంగా పెంచిన తల్లిదండ్రులకే చెందుతారని అధికారికంగా అప్పగించారు.

ఇదిలా ఉంటే, ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పనిచేస్తున్న కన్నతల్లి శారదా.. రాజకీయ పలుకుబడితో బాబును సొంతం చేసుకోవాలని చూస్తుందని పెంచిన తల్లిదండ్రులు రాజేష్‌, రమణమ్మ ఆరోపిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ద్వారా బాబును ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. 14 ఏళ్లుగా పెంచిన తమ బాబు తమకే చెందేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వేడుకుంటున్నారు. కేసు హెచ్‌ఆర్సీకి చేరింది. ఇప్పుడు ఆ బాబు పెంచిన తల్లి వద్దే ఉంటాడా… కనికరం లేకుండా 2 నెలల బాబును వదిలేసిన కన్నతల్లి చెంతకు చేరుతాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

Tomato Flu Virus: కేరళలో టమాటా ఫ్లూ విజృంభణ.. సరిహద్దు రాష్ట్రాలు హై అలెర్ట్

Adilabad: స్కూల్ టీచర్ల గబ్బుదందా..సంఘ భవనమే అడ్డాగా గురువుల అకృత్యాలు..