Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరుతో కార్యకర్తల్లో సరికొత్త జోష్

నా కుటుంబసభ్యులారా అంటూ తెలంగాణను ఓన్ చేసుకుంటోన్న ప్రధాని మోదీ.. అచ్చ తెలుగులో మాట్లాడి ఔరా అనిపించారు. బహిరంగ సభల్లో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఓవైపు మోదీ.. ఇంకోవైపు అమిత్ షా.. మరోవైపు యోగి ప్రచార సభలతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు.

Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరుతో కార్యకర్తల్లో సరికొత్త జోష్
Modi Is Impressing Everyone By Speaking In Telugu The Telangana Election Campaign

Updated on: Nov 26, 2023 | 10:12 PM

నా కుటుంబసభ్యులారా అంటూ తెలంగాణను ఓన్ చేసుకుంటోన్న ప్రధాని మోదీ.. అచ్చ తెలుగులో మాట్లాడి ఔరా అనిపించారు. బహిరంగ సభల్లో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఓవైపు మోదీ.. ఇంకోవైపు అమిత్ షా.. మరోవైపు యోగి ప్రచార సభలతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు.

తెలుగులో ప్రశ్నలు సంధిస్తూ తెలంగాణలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. తూప్రాన్‌లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కారణం ఓటమి భయమేనన్నారు మోదీ. మక్తల్‌ ఎన్నికల సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా చేయబోతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేయడం ఖాయమన్నారు షా.

కుత్బుల్లాపూర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌కు హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో బీజేపీలోని మిగతా స్టార్‌ క్యాంపెయినర్లు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..