Hyderabad MMTS Trains: హైదరాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో ఈరోజు రేపు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల (MMTS Trains)ను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. లింగంపల్లి(lingamapalli) నుంచి నాంపల్లి (namapally) రూట్‌లో నడిచే 9 సర్వీసులను, నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు నడిచే మరో 9 సర్వీసులను రద్దు చేశారు. అంతేకాదు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లిలో నడిచే 8 సర్వీసులు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు నడిచే మరో 8 సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసుని, లింగంపల్లి నుంచి -సికింద్రాబాద్ రూట్‌లో నడిచే మరో సర్వీసును రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు.
Also Read: