MLC Kavitha: బంజారాహిల్స్‌ నివాసం నుంచి ఢిల్లీకి.. ప్రగతి భవన్‌కు వెళ్లకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు ఎమ్మెల్సీ కవిత

|

Mar 08, 2023 | 4:45 PM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో సీబీఐ తనను ఏడు గంటలు విచారించింది. తాజాగా ఈ నెల 9వతేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

MLC Kavitha: బంజారాహిల్స్‌ నివాసం నుంచి ఢిల్లీకి.. ప్రగతి భవన్‌కు వెళ్లకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha
Follow us on

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్​ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో సీబీఐ తనను ఏడు గంటలు విచారించింది. తాజాగా ఈ నెల 9వతేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇదే అంశం పై కె. కవిత వివరణ ఇచ్చారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్​ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని.. ఈ నెల 10న జంతర్​ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉండడంతో విచారణకు హాజరయ్యే తేదీ మార్పు గురించి న్యాయ నిపుణులతో చర్చించి సలహా తీసుకుంటానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు.

గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేనని ఇప్పటికే చెప్పారు కవిత.. 15న హాజరవుతానంటూ ఈడీకి రిక్వెస్ట్ చేశారు. కవిత రిక్వెస్ట్‌పై ఇంకా స్పందించలేదు ఈడీ. అయితే ఈడీ నోటీసుల విషయంలో ఉదయం న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఫోన్లో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ” న్యాయపరంగా బీజేపీ అక‌ృత్యాలపై పోరాడుదాం.. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పార్టీ అండగా ఉంటుందంటూ కవితతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం.

చర్చలు జరిపిన తర్వాత బంజారాహిల్స్‌‌లోని తన నివాసం నుంచి ఢిల్లీ బయలుదేరారు కవిత. ప్రగతి భవన్‌కు వెళ్లకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ నోటీసుల విషయంలో ఉదయం న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. ఇప్పటికే కవితకు పూర్తి మద్దతు ప్రకటించారు సొంత పార్టీ నేతలు. ఎల్లుండి జంతర్‌మంతర్‌లో దీక్ష చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం