Susheel Reddy – NRI Doctor: కొన్ని గంటల్లో ఫ్లైట్ ఎక్కాల్సిన వ్యక్తి.. నీళ్ల కుంటలో శవమై తేలాడు. తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూడటానికి వెళ్లిన ఎన్నారై డాక్టర్ చనిపోవడం ఏమిటి? ఇదే డౌట్ అటు పోలీసులకు, ఇటు బంధువులకు కలిగింది. ఆరా తీయడంతో మిస్సింగ్ కేసు కాస్తా.. డెత్‌గా తేలింది. వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం అదృశ్యమైన.. డాక్టర్ జయశీల్ రెడ్డి నల్లగొండ నీట కుంటలో కొంచెం క్రితం శవమై కనిపించారు. నల్గొండ జిల్లా మేలదుప్పలపల్లికి చెందిన జయశీల్‌రెడ్డికి NRI డాక్టర్ అని పేరుంది. జమైకాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన జయశీల్‌రెడ్డికి మేలదుప్పలపల్లిలో ఫామ్‌హౌస్ ఉంది.
నిన్న ఫాం హౌస్ కు వెళ్లారు డాక్టర్ జయశీల్ రెడ్డి. అక్కడి నుంచి సింగిల్‌గా సెల్ఫీలు, వీడియోలు తీసుకుని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపాడు. ఆ తర్వాత ఆయన సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రేపు సాయంత్రం అమెరికా వెళ్లాల్సిన డాక్టర్ జయశీల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన కొన్ని గంటల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
అదృశ్యమయ్యే ముందు పంపిన సెల్ఫీలు, వీడియోల తీరు చూస్తే.. పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని.. జయశీల్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ వరద నీరు ఉండటంతో జయశీల్ రెడ్డి గల్లంతైనట్టు అనుమానించి గాలించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న బావిలో పడిపోయి ఉండవచ్చన్న అనుమానంతో నీటిని తోడారు. అయితే ఎన్నారై డాక్టర్ డెడ్‌బాడీ చివరకు నల్లగొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి దగ్గరలోని ఓ నీటి కుంటలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన జయశీల్‌రెడ్డి.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోదరుడు.
Read also: Teacher Indecency: కామంతో ఊగిపోయిన టీచర్.. స్కూల్‌లోనే చితకబాదిన పేరెంట్స్