BJP: బీజేపీ నుంచి రాజాసింగ్‌‌ సస్పెన్షన్‌.. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వివాదస్పద వ్యాఖ్యలు

ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా రాజాసింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న అధిష్టానం. షోకాజ్ నోటీసుకు 10 రోజుల్లో సమాధానం చెప్పాలని కోరింది.

BJP: బీజేపీ నుంచి రాజాసింగ్‌‌ సస్పెన్షన్‌.. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వివాదస్పద వ్యాఖ్యలు
Mla Raja Singh
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 23, 2022 | 3:33 PM

ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా రాజాసింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న అధిష్టానం. షోకాజ్ నోటీసుకు 10 రోజుల్లో సమాధానం చెప్పాలని కోరింది. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో పార్టీ ఈనిర్ణయం తీసుకుంది. రాజాసింగ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే రాజాసింగ్‌కు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది పార్టీ. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో రాజాసింగ్‌ను షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసుస్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు.

మునావర్‌ హైదరాబాద్‌కు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినా.. పోలీసులు ఆయనకు భద్రత ఎలా కల్పించారని రాజాసింగ్‌ ప్రశ్నించారు. తనపై ఏ యాక్షన్‌ తీసుకున్నా సిద్ధమే అని ప్రకటించారు. ధర్మంకోసం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భగ్గు మన్న ఎంఐఎం శ్రేణులు పాతబస్తీలో ఆందోళన చేపట్టాయి. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌ రాజాసింగ్‌ వీడియోను తొలగించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.