Viral: పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తూ..

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సర్వం సిద్ధం చేసింది.. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు.

Viral: పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తూ..
BRS MLA Malla Reddy

Updated on: Apr 27, 2025 | 1:39 PM

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సర్వం సిద్ధం చేసింది.. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. బీఆర్‌ఎస్‌ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్‌, ఎల్కతుర్తి గులాబీమయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ పార్టీ.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ చేసింది.. పార్టీశ్రేణులు అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి తరలివెళ్తున్నాయి. వేలాదిగా వస్తున్న కార్యకర్తలతో వరంగల్‌ పరిసరాలు గులాబీమయం అయ్యాయి. సాయంత్రం జరిగే బీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌ ప్రసంగం కోసం రెట్టించిన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కార్యకర్తలు. విపక్షాలు సైతం కేసీఆర్‌ ఏం మాట్లాడుతారా అనే ఉత్కంఠతో ఉన్నాయి.

కాగా.. మల్లారెడ్డి మరోసారి కార్యకర్తల్లో జోష్ నింపారు.. మాస్‌ సాంగ్‌కు మాజీ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు బయల్దేరిన అనుచరులు, నేతలతో కలిసి సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి రామక్క పాటకు డ్యాన్స్‌ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.

మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో చూడండి..

కాగా.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. BRS పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించలేమన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో పార్టీజెండాను ఎగరేశారు. అనంతరరం గన్‌ పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

వరంగల్‌లో ఎడ్లబండ్ల ర్యాలీని ప్రారంభించారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. వర్దన్నపేట నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి ర్యాలీని ప్రారంభించారు మాజీ మంత్రి. గులాబీ రంగు షర్ట్స్, కండువాలు ధరించి సభకు రావాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కోసం సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ అద్భుతం సృష్టించారు. కేసీఆర్‌కు వెండి, పట్టు పోగులతో ప్రత్యేక శాలువా తయారు చేశారు. కేసీఆర్, వరంగల్‌ కాకతీయ కమాన్ లోగోతో శాలువా రూపొందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..