ప్రజలకు సమాధానం చెప్పలేకే.. అలా చేస్తున్నారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో సీఎంపై జగదీష్‌ రెడ్డి కామెంట్స్‌!

TV9 క్రాస్‌ఫైర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ప్రతిపక్షాలపై వ్యక్తిత్వ హననం చేస్తుందన్నారు. కేసీఆర్..రెండేళ్లలో ఒక్కరోజూ రేవంత్‌పై మాట్లాడలేదు.. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ పేరు తీయని రోజు ఉందా అని జగదీష్‌ రెడ్డి ప్రశ్నించారు.

ప్రజలకు సమాధానం చెప్పలేకే.. అలా చేస్తున్నారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో సీఎంపై జగదీష్‌ రెడ్డి కామెంట్స్‌!
Jagadish Reddy Comments On

Updated on: Aug 24, 2025 | 11:21 PM

TV9 క్రాస్‌ఫైర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ప్రతిపక్షాలపై వ్యక్తిత్వ హననం చేస్తుందన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని.. కానీ కాంగ్రెస్‌ నేతల మాటలకు, మా మాటలకు చాలా తేడా ఉందిని ఆయన అన్నారు. సీఎం ఎంత దిగజారి మాట్లాడినా KTR అదుపు తప్పలేదన్నారు. కేటీఆర్ చిట్టినాయుడు అనడంలో బూతేం ఉందిని జగదీష్‌ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌ స్థాయిలో మేం వ్యక్తిత్వ హననం చేయలేదని..
రేవంత్‌ స్థాయిలో మేం యూట్యూబ్‌ చానెళ్లు కూడా నడపడం లేదని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో బీఆర్ఎస్‌ ముఖచిత్రం లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. రాజకీయాల్లో ఎవరూ ఎవర్ని ఎలిమినేట్‌ చేయలేరని ఆయన అన్నారు. మా ప్రెసిడెంట్‌ KCR .. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR పార్టీలో అందరూ సమానమేనని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.