Kamareddy: రైతుల విజయం.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యే గంపగోవర్ధన్ క్లారిటీ..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్ మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూములకు మారుస్తామని వివరించారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్ మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూములకు మారుస్తామని వివరించారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను.. ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగిస్తామని గంప గోవర్థన్ హామీ ఇచ్చారు. కన్సెల్టెన్సీ సంస్థ చేసిన తప్పిదం వల్లే ఈ గందరగోళం చోటు చేసుకుందని అన్నారు. కౌన్సిల్ సమావేశం తర్వాత మాస్టర్ ప్లాన్‌పై ముందుకు పోతామని చెప్పారు. తాజాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళన ఘటనకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ.. వెంటనే రద్దు చేయాలని నెల రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. తాజాగా.. ఈ ఘటనపై కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పందించారు. ముసాయిదాపై స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్ కాలేదని ఆయన వెల్లడించారు.
అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మార్పులు ఉంటాయి. ప్రతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు. ప్రస్తుతం జారీ చేసింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారం. జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదు. అభ్యర్థనల స్వీకరణకు జనవరి 11వరకు సమయం ఉంది. భూములు పోతాయని కొందరు పదే పదే చెబుతూ తప్పు దోవ పట్టిస్తున్నారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటాం.
– జితేశ్ పాటిల్, కామారెడ్డి కలెక్టర్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..