టాబ్లెట్‌ను ఇలా కూడా వాడుతారా..? యువతీయువకులు చేసిన పనికి చివరికి జరిగింది ఇదే!

| Edited By: Balaraju Goud

Sep 01, 2024 | 4:00 PM

వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేశారు. వాటిని బాగా దంచి పొడి చేసి దాచిపెట్టారు. తమకు అవసరమైనప్పుడల్లా ఆ పొడిని నీళ్లలో కలుపుకొని తాగారు. అంతేకాదు దానిని ఇంజక్షన్ రూపంలో శరీరంలోకి ఎక్కించుకున్నారు. ఇలా మత్తుకు కొన్ని నెలల పాటు అలవాటు పడిన గ్యాంగ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టాబ్లెట్‌ను ఇలా కూడా వాడుతారా..? యువతీయువకులు చేసిన పనికి చివరికి జరిగింది ఇదే!
Narsingi Drugs Case
Follow us on

వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేశారు. వాటిని బాగా దంచి పొడి చేసి దాచిపెట్టారు. తమకు అవసరమైనప్పుడల్లా ఆ పొడిని నీళ్లలో కలుపుకొని తాగారు. అంతేకాదు దానిని ఇంజక్షన్ రూపంలో శరీరంలోకి ఎక్కించుకున్నారు. ఇలా మత్తుకు కొన్ని నెలల పాటు అలవాటు పడిన గ్యాంగ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులే షాక్ అయ్యారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో నివాసం ఉంటున్న మిజోరాం రాష్ట్రానికి చెందిన యువతీయువకులు ఈ తరహా ప్రయోగానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కవాడిగూడా ప్రాంతానికి చెందిన సంజీవ్ అనే వ్యక్తి నుండి ఇలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే నైట్రోవర్ట్ టాబ్లెట్లను కొనుగోలు చేసి వీటిని పొడిగా మార్చి డ్రగ్స్ రూపంలో వాడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తులో భాగంగా మిజోరాం రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పక్కా సమాచారంతో వీరి నివాసం పైన బంజారా హిల్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసులు వెళ్లిన సమయానికే రూమ్ లో ఉన్న యువతి యువకులు అందరూ మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇల్లు మొత్తం సోదా చేయగా 52 గ్రాముల పౌడర్‌తోపాటు 40 కి పైగా సిరంజీలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరికి గత కొంతకాలంగా ఇలాంటి ప్రయోగం చేసి మత్తు ఎక్కించుకునేందుకు అలవాటు పడినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా వీరికి మందులు అమ్మిన సంజీవ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మత్తు పదార్థాలు అమ్మడంతో పాటు సేవించినందుకు గాను మొత్తం ఆరుగురు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై NDPS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు పెట్టారు. వీరితోపాటు డేవిడ్ అనే మరో కీలక నిందితుడు ఉన్నట్టు సమాచారం. అతని కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..