Nagarkurnool: గుత్తేదార్ల గుట్టు రట్టైంది.. కోట్ల రూపాయల ప్రజా సంపద కొట్టుకుపోయి సాక్ష్యంగా నిలిచింది

|

Sep 02, 2021 | 12:55 PM

వాగులు వంకలపై చెక్ డ్యాంలు చేపట్టి వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరద నీటిని నిల్వ చేయాలని ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాం చిన్నపాటి

Nagarkurnool: గుత్తేదార్ల గుట్టు రట్టైంది..  కోట్ల రూపాయల ప్రజా సంపద కొట్టుకుపోయి సాక్ష్యంగా నిలిచింది
Check Dam 2
Follow us on

Dundubhi River: వాగులు వంకలపై చెక్ డ్యాంలు చేపట్టి వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరద నీటిని నిల్వ చేయాలని ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాం చిన్నపాటి వరదకు కూలిపోయింది. కోట్లాది రూపాయల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయింది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం మిట్ట సదగోడులోని దుందుభి నదిపై నిర్మించిన చెక్ డ్యాం విషయంలో గుత్తేదార్ల గుట్టు రట్టైంది. మిట్టసదగోడు నుండి జప్తి సదగోడు వరకు అతి పెద్ద పొడవైన చెక్ డ్యాం నిర్మించారు. ఈ చెక్ డ్యాంను 7 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మించారు.

ఇదే కాకుండా, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని వేపూర్, సుద్దకల్, గుండూర్, వంగూర్ మండలంలోని మిట్ట సదగోడు, చింతపల్లి గ్రామాల వాగుల పై చెక్ డ్యాం లు నిర్మించి వరద నీరు నిలిచేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాలలో దుంధుబీ నది ప్రవహించే విస్తీర్ణాన్ని బట్టి నిధులు కేటాయించి టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టారు.

వంగూర్ మండలం మిట్ట సదగోడులోని దుందుభి నదిపై చెక్ డ్యాం మిట్టసదగోడు నుండి జప్తి సదగోడు వరకు అతి పెద్ద పొడవైన చెక్ డ్యాం నిర్మించారు. 7 కోట్ల 60 లక్షల రూపాయలతో దీని నిర్మాణం చేపట్టారు. కానీ ఈ నిర్మాణం చేపట్టిన గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పూర్తిగా నాసిరకంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. రెండు, మూడు రోజులు గా కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం నది ప్రవర్తిస్తోంది. ఈ కొద్దిపాటి ప్రవాహనికే చెక్ డ్యాం కూలిపోయింది.

ఆ ప్రాంతంలో నిర్మించిన మిగత చెక్ డ్యాములు కూడా నాసిరకంగా నిర్మించి ఉంటారని స్థానికులు ఆరోపించడంతోపాటు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అధికారులు గుత్తేదార్లతో కుమ్మక్కై ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తూ, ప్రజలకు ఇబ్బందులను గురిచేస్తున్నారని, ఇటువంటి గుత్తేదారుల లైసెన్సులు రద్దు చేసి, సంబంధిత శాఖా అధికారుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Check Dam

Read also:  YSR Vardhanti: వైయస్ఆర్ ఘాట్‌ దగ్గర సీఎం జగన్, వైఎస్ భారతి, విజయమ్మ, షర్మిల ఘన నివాళి.. ఫొటో గ్యాలరీ