Child Marriage: ఉన్నత చదువులు చదవాలి.. మంచి ఉద్యోగం చేయాలి.. కుటుంబానికి అండగా ఉండాలి.. అదీ ఆ బాలిక లక్ష్యం. కానీ, ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం తనకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే తాను చదువుకుంటానని, పెళ్లి వద్దని తల్లిదండ్రులకు చెప్పింది. వారిని వేడుకుంది. అయినా వారు ఆ బాలిక మాట వినకుండా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాంతో చేసేది లేక.. ఆ బాలిక నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసింది. తాను పెళ్లి చేసుకోనని, చదువుకుంటానని వేడుకుంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబ్ పేట మండలంలోని కొత్తపల్లికి చెందిన చెన్నయ్య, వెకంటమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఇద్దరు కుమార్తెల వివాహం చేశారు. మరో అమ్మాయి పదో తరగతి చదువుతోంది. కాగా, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే బాలిక ఎస్పీ రెమారాజేశ్వరికి కి ఫిర్యాదు చేసిన పెళ్లి విషయంపై ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక పెళ్లిని ఆపేశారు. అనంతరం బాలికను జిల్లా కేంద్రంలోని బాల సదన్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Also read:
Sonu Sood: అమ్మ మాటలతో ముందుకెళ్లా.. సినిమాలతో పేరొచ్చింది.. కానీ ‘సాయం’ సంతృప్తినిచ్చింది: సోనూసూద్
How to record WhatsApp voice calls Video: మీకు వాట్సప్ కాల్ ఎలా రికార్డ్ చేయాలో తెలుసా ..?