Minister Sabitha: మంచి మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. యూ టర్న్ తీసుకొని మరీ వచ్చి..

|

Feb 13, 2021 | 3:44 PM

Minister Sabitha Indra Reddy Talk With Women On Road: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు పక్కన అచేతనంగా పడిఉన్న ఓ మహిళను కాన్వాయ్ ఆపి మరీ...

Minister Sabitha: మంచి మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. యూ టర్న్ తీసుకొని మరీ వచ్చి..
Follow us on

Minister Sabitha Indra Reddy Talk With Women On Road: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు పక్కన అచేతనంగా పడిఉన్న ఓ మహిళను కాన్వాయ్ ఆపి మరీ పరామర్శించారు. మంత్రి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్ పల్లి మండల పర్యటనకు వెళ్తోన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మంత్రి సబిత్రా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్ పల్లి మండల పర్యటనకు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈ సమయంలో మంత్రి కాన్వాయ్ లంగర్ హౌజ్ టిప్పుఖాన్‌పూల్ ప్రాంతం మీదుగా వెళుతుండగా.. మంత్రి రోడ్డు పక్కన ఎండలో అచేతనంగా పడిఉన్న ఓ మహిళలను గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. కానీ అప్పటికే కాన్వాయ్ ఆ ప్రదేశం నుంచి ముందుకు వెళ్లిపోయింది. అయితే యూటర్న్ తీసుకొని మరీ ఆ మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్న మంత్రి.. ఆమెను పరామర్శించారు. రోడ్డు పక్కన ఉన్న మహిళకు మాటలు రావని సైగలు చేయడంతో నీళ్లు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించి.. తమ ప్రయాణాన్ని మళ్లీ మొదలు పెట్టారు సబితా ఇంద్రారెడ్డి.
Also Read: Sharmila new party: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌