గులాబీ పార్టీ తమ కార్యకర్తలకు బాసటగా నిలుస్తోంది. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంటోంది. ఇటీవల చనిపోయిన వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జానపల్లి భారతి కుటుంబానికి అండగా నిలిచింది ఆపార్టీ. క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న ఆమెకు పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల ఇన్సూరెన్సు చెక్కును కుటుంబ సభ్యులకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా ఉంటూ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా పార్టీ కార్యకర్తల్ని టీఆర్ఎస్ కాపాడుకుంటుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇలాఉండగా, సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సభలో పాల్గొనే ఎమ్మెల్యే, మంత్రులు కరోనా పరీక్షలు నిర్వహించుకొని నెగిటివ్ వస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఇప్పటికే స్పీకర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో నిరంజన్‌రెడ్డి కొవిడ్ పరీక్షలు చేయించుకోగా ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది.