Minister Malla Reddy: ‘నేను ఆ రకం కాదు’.. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి..

|

Dec 20, 2022 | 11:27 AM

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీలో అధిపత్య పోరు రచ్చకెక్కింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరికి చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై.. మంత్రి మల్లారెడ్డిపై నిరసన గళం విప్పారు.

Minister Malla Reddy: ‘నేను ఆ రకం కాదు’.. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి..
Malla Reddy
Follow us on

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీలో అధిపత్య పోరు రచ్చకెక్కింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరికి చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై.. మంత్రి మల్లారెడ్డిపై నిరసన గళం విప్పారు. ఈ పరిణామాలు BRS పార్టీలో కలకలం రేపాయి. గ్రేటర్‌ పరిధిలోని కీలక ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేయడం బీఆర్ఎస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్‌రెడ్డి, వివేకానంద్‌, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు సోమవారం భేటీ అయిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి తీరుపై వీరంతా చర్చించారు. దీనిపై పార్టీ అధిష్టానం స్పందించకముందే.. మంత్రి మల్లారెడ్డి మంగళవారం రియాక్ట్ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల తీరుగుబాటుపై మంత్రి మల్లారెడ్డి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తా.. వారితో మాట్లాడతానంటూ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. అవసరమైతే వారిని ఇంటికి ఆహ్వానిస్తాని.. తాను ఎవరితోనూ విబేధాలు పెట్టుకునే రకం కాదంటూ మంత్రి మల్లారెడ్డి స్పష్టంచేశారు. చిట్‌చాట్‌లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. పలు విషయాలను పంచుకున్నారు. ఇది తమ ఇంటి సమస్య లాంటిదని పేర్కొన్నారు. తాను గాంధేయవాదినని.. ఎవరితోనూ గొడవలు పడనని.. అంతా అన్నాదమ్ముల్లా ఉంటున్నామని వెల్లడించారు. ఎమన్నా సమస్య ఉంటే.. సీఎం కేసీఆర్ తో మాట్లాడతామని తెలిపారు. ఈ సమస్యను పెద్దది చేయొద్దంటూ సూచించారు.

ఇవి కూడా చదవండి

జిల్లాలో తమ నియోజకవర్గాలు ఉన్నా కూడా నామినేటెడ్‌ పదవుల్ని మాత్రం మంత్రి మల్లారెడ్డి తన మనుషులకే ఇప్పించుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవుల పంపకంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయిద్దామని మల్లారెడ్డితో చెప్పినా వినకుండా ఏకపక్షంగా జీవోలు ఇచ్చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీని వల్ల తమ నియోజకవర్గాల్లో పార్టీ కోసం పని చేసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, మల్లారెడ్డి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని చెప్పుకొచ్చారు. కాగా.. తాజా పరిణామాలతో మల్లారెడ్డి రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..