Telangana: మెట్రో రైలు విస్తరణకు నిధులు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్

|

Jun 25, 2023 | 4:58 AM

మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, పియుష్ గోయాల్‌తో భేటీ అయిన ఆయన తెలంగాణ కోసం పలు డిమాండ్లు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ తరహాలో లాగే పట్టణ పేదలకూ కూడా ఓ పథకం తీసుకురావాలన్నారు. రాబోయే బడ్జెట్‌లోనే ఇందు కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Telangana: మెట్రో రైలు విస్తరణకు నిధులు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్
Minister KTR
Follow us on

మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, పియుష్ గోయాల్‌తో భేటీ అయిన ఆయన తెలంగాణ కోసం పలు డిమాండ్లు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ తరహాలో లాగే పట్టణ పేదలకూ కూడా ఓ పథకం తీసుకురావాలన్నారు. రాబోయే బడ్జెట్‌లోనే ఇందు కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రులకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రోజురోజుకూ పట్టణ జనభా పెరిగిపోతోందని.. భవిష్యత్‌లో ఇది మరింత పెరుగుతుందని కేటీఆర్‌ అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా నగరపాలక సంస్థలకు ఈ వ్యవహారం సంక్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే.. గ్రామీణ స్థాయిలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ఉన్నట్లే పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని సూచించారు.

అయితే ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం జాబ్‌ కార్డులు జారీ చేసి నగరస్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటుందని చెప్పారు. మరోవైపు.. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2 పనులకు అనుమతులు మంజూరు చేయాలని అలాగే ఫేజ్‌-1లోని కారిడార్‌-3లో ఉన్న నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మెట్రో రైలు విస్తరణకు నిధులు సమకూర్చాలని మంత్రిని కోరారు. లింకు రోడ్డుల నిర్మాణానికి నిధులు సమకూర్చాలన్నారు. వీటితోపాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌-వరంగల్‌ మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ, శానిటేషన్‌ హబ్‌ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. హర్దీప్‌సింగ్‌ పురీతో భేటీ తర్వాత కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పురోగతిని వివరించడంతో దాని ప్రాధాన్యత గరించి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..