Hyderabad: ఢిల్లీ తర్వాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అని,హైదరాబాద్ నగరానికి 2072 వరకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వరుసగా ఏడు సంవత్సరాలు కరువు వచ్చినా తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ చుట్టూ వాటర్ పైప్ లైన్‌లను ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్ల విస్తరించిన తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేస్తున్నామని, రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు శుభదినం
హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు ఈ రోజు శుభదినం అని, మెట్రో వాటర్ సరఫరా, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత హైదరాబాద్‌లో నీటి అవసరాలు 37 టీఎంసీలు.. 2072 వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరో 34 టీఎంసీల అవసరం ఉంటుందని కేటీఆర్ అన్నారు. దాదాపు 71 టీఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉందని, 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామని పేర్కొన్నారు.
సుంకిశాలలో 1450 కోట్ల అంచనాతో పంపులు:
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల కోసం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రాబోయే ఎండకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తాగునీటి గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అన్నారు.
Addressing the media after laying foundation for construction of @HMWSSBOnline’s Intake Well Pumping Station in Nagarjunsagar https://t.co/0vWnGVerZd
— KTR (@KTRTRS) May 14, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి