EPFO Rules: పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి పెన్షన్ వస్తుందా..? నిబంధనలు ఏమిటి?
EPFO Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అర్గనైజేషన్ (EPFO) ఉద్యోగికి ఇది ఎంతో ముఖ్యం. ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగపడేది ఈ పీఎఫ్..
EPFO Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అర్గనైజేషన్ (EPFO) ఉద్యోగికి ఇది ఎంతో ముఖ్యం. ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగపడేది ఈ పీఎఫ్ డబ్బు. ప్రతి నెలా మీ జీతం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయా? అయితే మీరు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పింఛన్ పొందేందుకు అర్హుత కలిగి ఉంటారు. ఉద్యోగం చేసే వ్యక్తి జీతంలో కొంత భాగాన్ని పీఎఫ్‌ను కట్ చేస్తారు. కట్ అయిన డబ్బు పీఎఫ్ ఖాతాదారును ఖాతాలో జమ అవుతుంది. ఒక ఉద్యోగి వేసిక్ వేతనం నుంచి 12 శాతం మొత్తాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. ఈ 12 శాతం షేర్‌లో 8.33 శాతం ఈపీఎస్‌లో డిపాజిట్ అవుతుంది. ఉద్యోగి పదవి విరమణ పొందినప్పుడు అతను ఈ డబ్బును పెన్షన్‌గా పొందాలనేది దీని ఉద్దేశ్యం. దీంతో పాటు ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి అంటే భార్య , భర్త, పిల్లలకు ప్రతి నెలా EPF ద్వారా కుటుంబ పెన్షన్ అందజేస్తారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. EPS 95 పథకం కింద ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబం అంటే అతని భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్‌కి అర్హులవుతారు. దీనిపై ఈపీఎఫ్‌వో ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. ఏదైనా ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో గానీ ఖాతాదారుడు మరణిస్తే EPS 95 ప్రకారం.. అతని కుటుంబానికి కనీసం రూ. 1,000 నెలవారీ పెన్షన్ లభిస్తుంది.
అలాగే పీఎఫ్ ఖాతాదారుడికి వివాహం కానట్లయితే పీఎఫ్ నామినీ ఎవరైతే ఉన్నారో వారికి జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. మరోవైపు భార్య, భర్త ఇద్దరూ మరణించినట్లయితే ఈ పరిస్థితిలో ఖాతాదారుడి పిల్లలకు ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. భార్యకు వచ్చే పింఛనులో 25 శాతం పిల్లలకు అందుతుంది. ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పింఛను లభిస్తుంది. అయితే ఈపీఎఫ్ సభ్యులు పెన్షన్ పొందాలని భావిస్తే ఖాతాకు 10 ఏళ్ల పాటు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పదవీ విరమణ అనంతరం పెన్షన్ తీసుకోవచ్చు.
Benefits payable to Widow/Widower & Children under EPS’95.#EPFO #EPF #Services #SocialSecurity #Employee #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/9QUkN5BRAb
— EPFO (@socialepfo) May 11, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి