
KTR Interview Highlights: టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్ట కొద్దిరోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ గవర్నర్ వ్యవహారం, ధాన్యం కొనుగోలు, నదీజలాల వాటా.. ఇలా ఒకటేమిటీ ఎన్నో అంశాలపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనసులో ఉన్న మాటలను ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు.
ప్రాంతీయ పార్టీని స్థాపించి రెండు దశాబ్దాల పాటు నడిపించిన వ్యక్తుల్లో ఇద్దరే ఇద్దరు. స్వర్గీయ నందమూరి తారకరామారావు, కేసీఆర్. ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ, రెండు దశబ్దాల పాటు నడిపించడం, ప్రజలకు అనుగుణంగా నడిపించడం అనేది అంత సులువైనది కాదు. పార్టీ పెట్టి 21 ఏళ్లు నిండుతున్న కారణంగా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభ కాకుండా ఒక ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నాము.. అని అన్నారు. మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా అభివృద్ధి జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వేగంగానే అభివృద్ధి జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అబివృద్ధి పనులు జరిగాయి. దేశానికి అన్నం పెడుతున్నది రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఏడేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని మంత్రి కేటీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వమే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుంటుందని అన్నారు. అలాగే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనతనే బీజేపీకి బలం. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా చేసిందేమి లేదు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఉందనే విశ్వాసంతో బీజేపీకి ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
ఆరేళ్లలో తెలంగాణలో అన్ని సమస్యలు పరిష్కరించాం. ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించాం. దేశంలో 75 ఏళ్లుగా తాగునీటి సమస్య తీర్చలేకపోయారు. ఏపీ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో కుల రాజకీయాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదు. ఏనిమిదేళ్ల కాలంలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందంటే చెప్పుకునేందు ఏమీలేదు. పాత బస్తి, కొత్త బస్తి అంటూ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు.
డబుల్ ఇంజిన్ అంటే మోడీ.. ఈడీ.. తప్పు చేసిన వాళ్లు భయపడాలి.. మాకెందుకు భయం. నరేంద్ర మోడీ గాడ్సే భక్తుడని నేనంటున్నా.. నన్ను కూడా జైలులో పెడతారా పెట్టండి చూద్దాం అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
అలాగే తెలంగాణలో నెక్ట్స్ సీఎం కేటీఆర్ అనే అంశం ఎన్నో రోజుల నుంచి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. దీనికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. నేను ఏనాడు కూడా మంత్రి కావాలని అనుకోలేదు. ప్రజల ఆశీర్వాదంతో నేను మంత్రిని అయ్యాను. అదే నాకు గొప్ప.. రాష్ట్రంలో నేను సీఎం కావాలనే కోరిక ఏనాడు లేదు. నాకు మంత్రి పదవి రావడమే గొప్పగా భావించాను తప్ప సీఎం కావాలని అనుకోవడం లేదు అంటూ కేటీఆర్ చమత్కరించారు.
టీఆర్‌ఎస్ భవిష్యత్తు గుర్తించి క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెబుతారన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ టీఆర్‌ఎస్ అనేది ఏకైకా స్వీయ రాజకీయ ఆస్తిత్వ పతాకం. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ గుండె చప్పుడు టీఆర్‌ఎస్. టీఆర్‌ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలుగుతాము. అది ఎవరుంటారు.. అనేది తర్వాత విషయం. తెలంగాణకు బాధ కలిగితే అందరికంటే ఎక్కువ బాధపడేది టీఆర్‌ఎస్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. ఏదైనా ప్రయోజనం కలిగితే అందరికంటే సంతోషపడేది టీఆర్‌ఎస్. జై తెలంగాణ నినాదం.. దాని వెనుకున్న శక్తి.. ఆ శక్తి చుట్టు అలుముకున్న తెలంగాణ ఆస్తిత్వం. అదే మా బలం.. దానిని తప్పకుండా తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారని నా విశ్వాసం పేర్కొన్నారు.
తెలంగాణలో నెక్ట్స్ సీఎం కేటీఆర్ అనే అంశం ఎన్నో రోజుల నుంచి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. దీనికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. నేను ఏనాడు కూడా మంత్రి కావాలని అనుకోలేదు. ప్రజల ఆశీర్వాదంతో నేను మంత్రిని అయ్యాను. అలాగే రాష్ట్రంలో నేను సీఎం కావాలనే కోరిక ఏనాడు లేదు. నాకు మంత్రి పదవి రావడమే గొప్పగా భావిస్తాను అంటూ చమత్కరించారు మంత్రి కేటీఆర్.
సిరిసిల్లలో 90 శాతం అభివృద్ధి జరిగింది. ఇంకో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అవి పూర్తయితే వందశాతం అభివృద్ధి జరిగినట్లే అని అన్నారు. టెక్‌టైల్స్ పార్క్ ఫెయిలూరా..? సక్సెసా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. టెక్‌టైల్స్ పార్క్ సక్సెస్ అని చెప్పారు.
డబుల్ ఇంజిన్ అంటే మోడీ.. ఈడీ.. తప్పు చేసిన వాళ్లు భయపడాలి.. మాకెందుకు భయం. నరేంద్ర మోడీ గాడ్సే భక్తుడని నేనంటున్నా.. నన్ను కూడా జైలులో పెడతారా పెట్టండి చూద్దాం అంటూ టీవీ9 క్రాస్ ఫైర్‌లో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
మతమూ.. పాతబస్తీ అనకుండా తెలంగాణలో ఎన్నికలకు వస్తారా..? అంటూ బీజేపీకి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. మతాలు.. కులాలు అంటూ బీజేపీ మాట్లాడుతుంది తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదు.
హిందుత్వ నినాదం.. తెలంగాణ సెంటిమెంట్ అనే అంశంలో రాష్ట్రం ఎటువైపు మొగ్గు చూపుతుందనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. బీజేపీ పార్టీ లేకముందు అందరు హిందువులే. ఎవ్వరు కూడా గుడికి వెళ్లనట్లు, ఇళ్లల్లో పూజా మందిరాలు లేనట్లు ఒక భ్రమ కల్పించారు. కానీ మతము, పాతబస్తీ అని మాట్లాడకుండా రమ్మనండి.. వాళ్లకు ఎంత నీతి, నిజాయితీ ఉందో తెలిసిపోతుంది.. అని అన్నారు.
తెలంగాణలో కులాలు, మతాలు అంటూ ఏమి లేవు. అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమానం. దీని ప్రకారమే మేమ వచ్చే ఎన్నికలలో ముందుకెళ్తాం. మాకైతే విశ్వాసం ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో తాము సింగిల్‌గానే ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఎంఐఎంతో పోత్తు అనేది ఉండదని మంత్రి కేటీఆర్ ఆన్నారు. ఇప్పటి వరకు కూడా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోలేదని, రానున్న రోజుల్లో కూడా పొత్తు అనేది ఉండదని స్పష్టం చేశారు.
దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఏడేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదు. తమ ప్రభుత్వమే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుంటుంది.
సంక్షేమ పథకాలతో సంపద పునరుత్పత్తి అవుతోంది. తెలంగాణలో భూములు వంద రెట్లు పెరిగాయి. ప్రభుత్వంపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో తిరుగుతున్న షర్మిల మోడీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. వీరు ఎవరికి ఏజెంటుగా పని చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.
అన్ని రాష్ట్రాల్లో తప్పులు జరుగుతుంటాయి. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలో ఎలాంటి తప్పులు జరగవు. కానీ బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలో తప్పులు జరుగుతున్నాయని అనడం సరైంది కాదు. ఇతర రాష్ట్రాల్లో అరెస్టులు, కేసులు జరిగితే.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అరెస్టులు, కేసులు కావడం లేదు. బీజేపీ ఉన్న రాష్ట్రాలు తప్ప ఇతర రాష్ట్రాలు తప్పులు చేస్తున్నాయా..? అంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సరిపోరు. టీపీసీసీ, టీబీజేపీలు ఉన్నాయంటే కేసీఆరే కారణం అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఇప్పటికీ మిగులు బడ్జెట్‌లోనే ఉంది. పెట్టుబడులను అప్పులుగా చూడకూడదు. సంపద పునరుత్పత్తి కోమే అప్పులు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి కాంగ్రెస్. 2024లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే ముందుకెళ్తుంది. షర్మిల, ప్రవీణ్ కుమార్, పాల్ మాకు ప్రతిపక్షం కావచ్చు అని టీవీ9 క్రాస్ ఫైర్‌లో మంత్రి కేటీఆర్ అన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పక్క రాష్ట్రాలకు తరలించారు. మిషన్ భగీరథ కోసం తెలంగాణకు రూ.24వేల కోట్లు ఇవ్వమని అడిగితే కాగ్ సిఫార్సు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది.
భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. కనీసం ప్రధాని నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. నేను ప్రధానిగా ఉన్న సమయంలో అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ వచ్చిందనే పదం మోడీ నుంచి వచ్చిందా..? ఒక్కమాట కూడా రాలేదన్నారు కేటీఆర్. తెలంగాణ భారతదేశంలో లేదా.? ఎందుకు నీకంత కోసం తెలంగాణపై అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
కేంద్రం తెలంగాణకు ఎన్నో ఇచ్చిందని చెప్పుకొంటోందని, ఏమి కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదన్నారు. కాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ పక్క రాష్ట్రాలకు తరలించారు. అన్ని సమస్యలు కూడా తామే పరిష్కరించుకుంటున్నాము తప్ప.. కేంద్రం నుంచి అందిన సాయం ఏమిలేదన్నారు.
తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది ఒక్కటి చెప్పమనండి. గతంలో నితిఆయోగ్ సంస్థ సిఫారసు చేసింది. తెలంగాణ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. అందులో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ఇందు కోసం రూ.24వేల కోట్లు ఇవ్వండి. ఒకదానికి రూ.19వేల కోట్లు ఇవ్వండి.. ఇంకోదానికి రూ.5వేల కోట్లు ఇవ్వండని అంటే ఒక్క పైస కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
దేశానికి తెలంగాణ ఇస్తోంది తప్ప.. తెలంగాణకు దేశం ఇచ్చింది ఏమి లేదు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతోంది. దేశానికి ఎజెండాను మన రాష్ట్రం డిసైడ్ చేస్తోంది. జాతీయ స్థాయిలో కచ్చితంగా పోటీ చేస్తాం. దేశానికి ఎజెండా నిర్ణయించాల్సిన సమయం వచ్చింది.
కాంగ్రెస్ బలహీనతే బీజేపీ బలం. జాతీయ స్థాయిలో బీజేపీ ఓటు శాతం 33 శాతం మాత్రమే. ఆరేళ్ల కాలంలో తెలంగాణలో ఉన్న సమస్యలు తామే పరిష్కరించుకున్నాము. కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందేమి లేదు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదు. ఏనిమిదేళ్ల కాలంలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందంటే చెప్పుకునేందు ఏమీలేదు. పాత బస్తి, కొత్త బస్తి అంటూ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.
తెలంగాణ ప్రజలు చైతన్య వంతులని మంత్రి కేటీఆర్ అన్నారు. టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూలు పలు విషయాలను వెల్లడించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఎలాంటి ఫలాలు అందలేదు.
ఆరేళ్లలో తెలంగాణలో అన్ని సమస్యలు పరిష్కరించాం. ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించాం. దేశంలో 75 ఏళ్లుగా తాగునీటి సమస్య తీర్చలేకపోయారు. ఏపీ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో కుల రాజకీయాలు లేవు
చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనతనే బీజేపీకి బలం. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా చేసిందేమి లేదు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఉందనే విశ్వాసంతో బీజేపీకి ఓటు వేశారు. జాతీయ స్థాయిలో వెళ్లే ఆలోచన ఉంది. ఎప్పుడు అనేది చెప్పలేము.
తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా అభివృద్ధి జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వేగంగానే అభివృద్ధి జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అబివృద్ధి పనులు జరిగాయి.
నేను పార్టీలోకి 2006లో వచ్చాను. నేను నా ఉద్యోగం వదిలి పెట్టి పార్టీలో చేరాను. 2009 వరకు పార్టీలో పని చేశాను. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా చేశాను.
ప్రాంతీయ పార్టీని స్థాపించి రెండు దశాబ్దాల పాటు నడిపించిన వ్యక్తుల్లో ఇద్దరే ఇద్దరు. స్వర్గీయ నందమూరి తారకరామారావు, కేసీఆర్. ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ, రెండు దశబ్దాల పాటు నడిపించడం, ప్రజలకు అనుగుణంగా నడిపించడం అనేది అంత సులువైనది కాదు. పార్టీ పెట్టి 21 ఏళ్లు నిండుతున్న కారణంగా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభ కాకుండా ఒక ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నాము.
గవర్నర్ వ్యవహారంపై కేటీఆర్ మాటేంటి.? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంత? ఇలాంటి పలు ప్రశ్నలకు కేటీఆర్ టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూలలో సమాధానం కొద్ది సేపట్లో చెప్పనున్నారు.