KTR : వేములవాడలో 22 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

|

May 28, 2021 | 9:36 PM

వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను

KTR : వేములవాడలో  22 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Ktr Vemulawada Hospital Ina
Follow us on

KTR inaugurates 100-bed Government Hospital : వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వేములవాడ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించడం జరిగిందని కేటీఆర్ చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నపం చేసిన విషయాన్ని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు. క‌రోనా తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని వేముల‌వాడ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ లో బెడ్ల సంఖ్య‌ను కూడా పెంచామ‌న్నారు మంత్రి కేటీఆర్. ప్ర‌స్తుతం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతుంద‌ని..అయితే ఒక‌వేళ పెరిగే అవ‌కాశం ఉన్నా ఈ హాస్పిట‌ల్స్ ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు.

క‌రోనా బాధితుల‌కు ఆక్సిజ‌న్, మందుల కొర‌త లేకుండా చూస్తున్నామ‌న్న కేటీఆర్.. బ్లాక్ ఫంగ‌స్, వైట్ ఫంగ‌స్ కు సంబంధించి కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉంచామ‌న్నారు. డాక్ట‌ర్లు చెప్పిన సూచ‌న‌ల‌ మేర‌కు ఫంగ‌స్ ల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. క‌రోనా శాశ్వ‌త ప‌రిష్కారం వ్యాక్సినేష‌న్ తోనే సాధ్యం అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని తెలిపారు. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా అంద‌రికీ వ్యాక్సిన్ వేయాల‌నుకుంటున్నామ‌ని..ఇందుకు కేంద్రం స‌పోర్ట్ ఉండాల‌ని కేటీఆర్ చెప్పారు.

Ktr At Vemulawada Hospital

Read also :  Nandamuri Ramakrishna : అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది : నందమూరి రామకృష్ణ