ఆ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం.. అలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య

|

Mar 05, 2022 | 5:43 PM

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ హెల్త్​ప్రొఫైల్(Health Profile) తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి హెల్త్​చెకప్​చేస్తారని చెప్పారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా...

ఆ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం.. అలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య
Health profile in Telangana
Follow us on

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ హెల్త్​ప్రొఫైల్(Health Profile) తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి హెల్త్​చెకప్​చేస్తారని చెప్పారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada)లో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్​ప్రాజెక్టును మంత్రి కే.తారక రామారావు ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కిట్​ను రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హెల్త్​రికార్డుల ద్వారా అత్యవసరమైన పరిస్థితుల్లో వెంటనే వైద్యం అందించే అవకాశం ఉంటుంది తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ అన్నారని, ఆ దిశగా తాము కృషి చేస్తున్నామని అన్నారు. హెల్త్​ ప్రొఫైల్ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.7,300 కోట్లతో ఈ నెల 8న వనపర్తిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్​, కర్ణాటకలో ఆక్సిజన్​అందక ఆస్పత్రిలో పిల్లలు చనిపోయారు. కానీ తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చనిపోలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రజ‌లందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ప్రక్రియ చేపట్టామ‌ని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఇంటికి వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వెళ్లి.. వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించి, ఆ వివ‌రాల‌ను ట్యాబ్‌లో న‌మోదు చేసుకుంటారు. హెల్త్ రికార్డులు సక్రమంగా నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు. అలాంట‌ప్పుడు రోగి వేలి ముద్ర లేదా ఐరిష్‌తో అన్ని రికార్డులు, వివరాలు తెలుసుకుని వెంటనే చికిత్స ప్రారంభించవచ్చని చెప్పారు. అత్యవసర సమయంలో, విలువైన అర గంట సమయం కూడా వృధా కాకుండా ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుంద‌ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. 60 రోజుల అనంత‌రం మిగ‌తా జిల్లాల్లో అమ‌లు చేస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

హెల్త్ కార్డు ఉండడం వల్ల ఆరోగ్య డేటాతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడం సులభం అవుతుందన్న మంత్రి కేటీఆర్.. కచ్చితమైన చికిత్స ద్వారా తొందరగా జబ్బులు, రోగాల నుంచి కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలు ప్రాణాలు కాపాడిన వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆశా వర్కర్ల నుంచి డాక్టర్ల వరకు కరోనా కాలంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ప్రాంతం, ఆహారపు అలవాట్లను బట్టి వ్యాధులు వస్తాయని.. అందుకే ఆరోగ్య డేటా ఆధారంగా భవిష్యత్ లో ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఐసీయూ కేర్ లేదని కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఐసీయూ కేర్ లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Also Read

Telangana: మిషన్‌-2024..! ఒకే దెబ్బకు రెండు పిట్టలు.! తెలంగాణలోకి పీకే అండ్ టీమ్‌ ఎంట్రీతో మారిన సీన్!

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి.. మా విద్యార్థుల కోసం సేఫ్ కారిడార్..

AP Capital Issue: ఏపీలో మూడు రాజధానులపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో