ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలాచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు నీటిమయమయ్యాయి. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలోని క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటల్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు ఆందోళన చెందొద్దని.. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ అంటేనే భారత రైతు సమితి అన్నారు.
దాదాపు 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామి ఇచ్చారు. ఇప్పటికే ఏడున్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. త్వరలోనే డబ్బులు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. కర్ణాటక ప్రధాని నరేంద్ర మోదీ ఏ కల్చర్‌ను వద్దని గొంతు చించుకున్నారో.. ఇప్పుడు అదే కల్చర్‌ను అవలంభిస్తున్నారంటూ విమర్శించారు. కర్ణాటకకే ప్రధాని మోదీ ప్రధానా ? మిగతా రాష్ట్రాల్లో సిలిండర్, పాలు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..