BRS Party: గులాబీ దళంలో ఎన్నికల వేడి.. వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్న కేటీఆర్‌.. ఎమ్మెల్యేల పనితీరుపైనే బేరీజు..!

|

Jul 01, 2023 | 8:21 AM

Minister KTR: ఎన్నికలకు ఇంకాస్తా టైముంది. ఐతేనేం.. తెలంగాణలో వేడి రాజుకుంది. ఎవరికి వారు గెలుపు గుర్రాలను గుర్తించేపనిలో పడ్డారు. ఈ విషయంలో మిగతావారికన్నా..గులాబీపార్టీ కాస్తా ముందంజలో ఉంది. మంత్రి కేటీఆర్‌ తన పర్యటనలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. అభ్యర్థులను గుర్తించి సభ వేదికపైనే ప్రకటిస్తున్నారు.

BRS Party: గులాబీ దళంలో ఎన్నికల వేడి.. వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్న కేటీఆర్‌.. ఎమ్మెల్యేల పనితీరుపైనే బేరీజు..!
Minister KTR and CM KCR
Follow us on

BRS Party: యస్‌.. గులాబీ పార్టీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయా జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ కేడర్‌పై దృష్టి సారించారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే మళ్లీ టిక్కెట్‌, లేదంటే మరొకరికి ఆ ఛాన్స్‌ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తానూ పాల్గొనబోయే సభలోనే ప్రజల సమక్షంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. గురువారం నల్లగొండజిల్లా తుంగతుర్తి పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను మూడోసారి ముచ్చటగా గెలిపించాలని సభావేదికపైనే ప్రకటించారు. అంతేకాదు.. గాదరి కిషోర్‌ను 40వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు కేటీఆర్‌.

అయితే ఎమ్మెల్యే టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి..? సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌ ఈ విషయంపై ఇప్పటికే ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని డిసైడైనట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై పక్కా క్లారిటీతో ఉండటంతో మంత్రి కేటీఆర్‌ తన పర్యటనలో అభ్యర్థులను ముందే ప్రకటిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని తెలిస్తే, ఆ విషయాన్ని అక్కడే చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మహబూబాబాద్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇది టిక్కెట్‌ నిరాకరణకు సంకేతమంటూ నియోజకవర్గంలో ఇదే చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఇటీవల వరంగల్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌కు టికెట్‌ అనౌన్స్‌ చేశారు. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తోంది. ఇంకొందరు అభ్యర్థుల విషయంలోనూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటనతో గులాబీదళంలో ఆ వేడి మొదలైందనే చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..