Jagadeesh Reddy: దేశాభివృద్ధిలో జాతీయ పార్టీలు విఫలం.. కేసీఆర్ BRS ఏర్పాటుపై మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

|

Jun 15, 2022 | 2:41 PM

CM KCR భారతీయ రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Jagadeesh Reddy: దేశాభివృద్ధిలో జాతీయ పార్టీలు విఫలం.. కేసీఆర్ BRS ఏర్పాటుపై మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Jagadish Reddy
Follow us on

Minister Jagadeesh Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో వరుసగా భేటీ కావడంతో.. ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. CM KCR భారతీయ రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో జాతీయ పార్టీలు విఫలం వల్లే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన సూర్యాపేటలో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు దేశ భవిష్యత్తుకు సరైన పునాదులు వేయలేకపోయాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సహజవనరులు ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చారంటూ మండిపడ్డారు.

బీజేపీ పాలన దేశాన్ని మధ్యరాతి యుగం వైపు తీసుకెళ్తోందని.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందంటూ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని వివరించారు. ప్రత్యామ్నాయ అజెండా తీసుకొచ్చే శక్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్త తరానికి.. సరికొత్త అజెండాతో కేసీఆర్ రాబోతున్నారన్నారు. కేసీఆర్ కొత్త అజెండా పిలుపు పట్ల దేశ వ్యాప్తంగా మద్దతు వస్తుందని ఆయన వివరించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ దేశ రూపురేఖల్ని మార్చే అజెండాను ప్రకటిస్తారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..