Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు

|

Jul 19, 2022 | 5:08 PM

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోదలిచిన వారికి కూడా రుణాలు మంజూరు త్వరలోనే మంజూరు చేస్తామని హరీశ్‌ రావు ప్రకటించారు.

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు
Ration Card Telangana
Follow us on

Minister Harish Rao : తెలంగాణలో త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ఒకటి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోదలిచిన వారికి కూడా రుణాలు మంజూరు త్వరలోనే మంజూరు చేస్తామని హరీశ్‌ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వచ్చే 2 నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి హరీశ్‌ రావు స్పష్టంచేశారు.

గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వరద వచ్చిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడున్నంత అభివృద్ధి లేదంటూ విమర్శించారు. బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోందంటూ మంత్రి హరిశ్ రావు విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..