తెలంగాణ బడ్జెట్ లో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయానికి, నీటిపారుదల రంగం, వాటి అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు ఇచ్చారు. వ్యవసాయరంగానికి రూ. 26,831 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని కొనియాడారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,17,215 ఉందన్న మంత్రి హరీశ్.. మూలధన వ్యయం రూ.37,525 కోట్లు ఉందన్నారు. దేశంలో అత్యధికంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. అని హరీశ్ అన్నారు. మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో.. అందరిచూపు బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే ఉంది.
దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు, ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు, ఎస్పీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం రూ.2వేల కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల కోసం 2,500 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..