Huzurabad By Election: నిబద్ధతగల టీఆర్ఎస్‌.. అబద్ధాల బీజేపీ మధ్యే పోటీ: మంత్రి హరీశ్ రావు

Gellu Srinivas Yadav filed Nomination: హుజూరాబాద్ ఎన్నికల్లో నిబద్ధతగల టీఆర్ఎస్‌.. అబద్ధాల బీజేపీ మధ్యే పోటీ నెలకొందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అమ్మకాల బీజేపీకి, నమ్మకాని

Huzurabad By Election: నిబద్ధతగల టీఆర్ఎస్‌.. అబద్ధాల బీజేపీ మధ్యే పోటీ: మంత్రి హరీశ్ రావు
Harish Rao

Updated on: Oct 08, 2021 | 2:04 PM

Gellu Srinivas Yadav filed Nomination: హుజూరాబాద్ ఎన్నికల్లో నిబద్ధతగల టీఆర్ఎస్‌.. అబద్ధాల బీజేపీ మధ్యే పోటీ నెలకొందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అమ్మకాల బీజేపీకి, నమ్మకాని మారుపేరైన టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతోందంటూ వెల్లడించారు. అరచానికి అభివృద్ది మధ్య, బొట్టు బిళ్లకు.. కల్యాణ లక్ష్మికి మధ్య పోటీ జరుగుతోందంటూ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలంటూ మంత్రి హరీష్ రావు కోరారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారుు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ తరుపున శుక్రవారం మూడవ, నాల్గవ నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్‌కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనుకు ఎన్నికల ఖర్చు కోసం ప్రజలే డబ్బులు ఇస్తున్నారన్నారు. పేద మహిళలు ఆసరా పెన్షన్ డబ్బులు కూడా ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

హూజూరాబాద్‌లో ముందు నుంచి టీఆర్ఎస్‌ బలమైన పార్టీగా ఉందన్నారు. 2001లో రైతు నాగలి గుర్తుతో ప్రజాప్రతినిధులను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రస్తుతం అబద్ధాల పార్టీ బీజేపీకి నిబద్ధత గల పార్టీ టీఆర్ఎస్‌కు మధ్య పోటీ జరగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధికి ప్రజలు ఆశీర్వచనలు అందిస్తారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై జీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని సూచించారు. బీజేపీ పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందన్నారు. హూజూరాబాద్ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని.. ఇక్కడ 60 -70 వేల మంది రైతులు ఉన్నారన్నారు. టీఆర్ఎస్‌కు రైతులు ఎందుకు ఓటు వేయాలో వంద కారణాలు చెపుతానని.. బీజేపీ ఒక్కటైనా చెబుతుందా అంటూ నిలదీశారు.

టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. సంక్షేమానికి, అభివృద్ధిని ఆమోదించినట్లేనని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ ఎన్నికలో గెల్లు శ్రీను గెలుస్తారని పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వం మీద విమర్శలు చేసి సెంటిమెంట్‌తో ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వ్యక్తి ప్రయోజనం కంటే.. హూజురాబాద్ సంక్షేమం ముఖ్యమంటూ పేర్కొన్నారు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక ఈటల అహంకారానికి – పేద ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య పోటీ అని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో గెలుస్తానంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read:

Huzurabad By Election: నామినేషన్ల పర్వానికి మూడు రోజులే.. రిటర్నింగ్‌ ఆఫీసు ముందు అభ్యర్థుల భారీ క్యూ..

Huzurabad Bypoll: పెనుగులాట జరుగుతుంది… ఏం చేసినా జనం నా వెంటే.. ఎన్నికల్లో గెలిచి తీరుతాంః ఈటల