CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం.. పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. ఆదేశాలు జారీ

|

Feb 26, 2021 | 9:27 PM

CM KCR: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ ముందడుగు వేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా..

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం.. పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. ఆదేశాలు జారీ
Follow us on

CM KCR: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ ముందడుగు వేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సంవత్సరం దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆశించినట్లుగా ఫలితాలు రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం మరింత అప్రమత్తం అయింది. అచితూచి అడుగులు వేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెక్‌ పెట్టాలని వ్యూహాలు రచిస్తుండటం, మరో వైపు ఇతర విపక్షాలు, ఇండిపెండెంట్లు సైతం రంగంలో ఉండటంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పట్టభద్రుల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత పలువురు మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముగ్గురు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుసో్తోంది. రంగారెడ్డికి మంత్రి హరిష్ రావు, హైదరాబాద్‌ కు గంగుల కమలాకర్‌, మహబూబ్‌ నగర్‌ కు మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యత పలువురు మంత్రులకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతో ఆ బాధ్యతలను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పట్టభద్రులు తప్పకుండా గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

అయితే ఎక్కువ మంది తమకు కేటాయించని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించలేకపోయారు. ఈసారి మాత్రం ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్‌ఎస్‌. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తప్పకుండా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి పని చేయాలని, లేకపోతే ఊరుకునేది లేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థులు తప్పకుండా గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది టీఆర్‌ఎస్‌. అయితే గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం, హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో సరైన మెజార్టీ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మరింత అప్రమత్తమైంది.

నామినషన్ల ఉపసంహరణ

కాగా, ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులుండగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ముగ్గురు అభ్యర్థులు నామినషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తుండగా, మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: PAN CARD: మీరు ఇలా చేయకపోతే మీ పాన్‌ కార్డు రద్దు.. రూ.10 వేల జరిమానా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు