హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న 18ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో హరే కృష్ణా మూమెంట్ వారితో కలిసి సర్కార్ ఏర్పాటు చేసిన పేషేంట్ సహాయకుల భోజన వసతి కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోగి సహాయకులకు ఉదయం రోజు పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ రైస్, పులిహోర లాంటివి ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్నం, రాత్రి పూటలు అన్నంతో పాటు సాంబారు, పచ్చడి, కూర అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రిలో భోజన వసతి కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది అని, ఈ పథకం కోసం ప్రభుత్వం తరపున ప్రతి నెల రూ.40 కోట్ల రూపాయలను వేచ్చిస్తున్నారని ప్రకటించారు.
ఉస్మానియా గాంధీ సహా భాగ్యనగరంలో అనేక ప్రభుత్వ ఆస్పత్రులు నిత్యం వేలాది మంది రోగులకు సేవలు ఆందిస్తున్నాయి. మెరుగైన వైద్య సేవల కోసం పేదలు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ వైద్య సేవలు పొందుతుంటారు. ఐతే రోగులకు నిత్యం ప్రభుత్వమే ఉచితంగా భోజనం అందిస్తున్నా…పేషేంట్ అటెండర్ లకు మాత్రం తిండి కోసం తిప్పలు తప్పడం లేదు. స్వచ్చంద సంస్థల వారు ఇచ్చే భోజనంతో కడుపునింపుకునే వారు మరికొందరు ఆహారం లేక ఒక్కపూట తిని ఒక పూట పస్తులుండే వారు..అలాంటి వారి ఆకలితీర్చేందుకే సర్కారు నేటి నుంచి నగర వ్యాప్తనంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం 3 పూటలా 5 రూపాయలకే భోజన సదుపాయాన్ని ప్రారంభించింది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎం ఎన్ జె, నిలోఫర్, సరోజిని దేవి, పేట్ల బూర్జు మెటర్నిటీ, కోటి మెటర్నిటీ, చెస్ట్ ఆస్పత్రి, టిమ్స్, కోటి ఈ ఎన్ టి, ఫీవర్, గోల్కొం ఏరియా ఆశపత్రి, వనస్థలిపురం, కొండాపూర్ , నాంపల్లి ఏరియా ఆస్పత్రుల్లో నేటి నుంచి 5 రూపాయలకే రోగి సహాయకులకు భోజనం అందించనున్నారు. ఇందుకోసం లబ్ది దారులు రోగి కి సంబందించిన అడ్మిట్ కార్డ్ చూపిస్తే చాలు. నిత్యం నగర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారాని సర్కారు అంచనా వేస్తోంది. ఇక పేద రోగుల సహాయార్ధం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని మంత్రులు ఎన్నారు.
అటు, కోఠి మెటర్నిటీ ఆసుపత్రి, ఎం.ఎన్.జె (మెహది నవాబ్ జాంగ్) ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ లో మూడు పూటల భోజనం పథకాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవల కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పేదలకు మెరుగైన వైద్యం, చికిత్సలను అందుబాటులోకి తెచ్చారన్నారు. హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం రాష్ట్ర నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా చికిత్సల కోసం వచ్చే రోగుల సహాయకులకు మూడు పూటల మంచి పౌష్టికాహారాన్ని రూ.5 లకే అందించడంతో పాటుగా షెల్టర్లు, వైద్యం, ఆరోగ్య పరీక్షలు, మెడిసిన్ లు ఉచితంగా అందించడం వలన పేదలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వెసులుబాటు ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ఎం ఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నర్సింగ్ స్టాఫ్ తో కలిసి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్న వసతులను ప్రభుత్వ హాస్పిటల్ లో వసతుల ఏర్పాటు కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని అన్నారు.