Minister Gangula: రూ.90 గడియారాన్ని చూసి కేసీఆర్ కి అన్యాయం చేయద్దు.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Jul 19, 2021 | 1:36 PM

దళిత బంధుతో అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని చెప్పారు. దళిత బంధు స్కీమ్‌తోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నికపై కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Minister Gangula: రూ.90 గడియారాన్ని చూసి కేసీఆర్ కి అన్యాయం చేయద్దు.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Gangula
Follow us on

Minister Gangula Kamalakar Sensational Comments: దళిత బంధుతో అంబేద్కర్ కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిన అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకమైన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టడం ఆనవాయితీ అన్న మంత్రి.. దళిత బంధు పథకాన్ని కూడా సీఎం ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చౌక్‌‌లో కేసీఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. అనంతరం డప్పుదరువులతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దళితల అభ్యున్నతిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దళిత బంధుతో అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని చెప్పారు. దళిత బంధు స్కీమ్‌తోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నికపై కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దళితులు ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంతకాలం అన్ని పార్టీలు దళితులను ఓట్ల కోసం, రాజకీయాలకు వాడుకున్నాయి. కానీ వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. అందుకే నిరుపేద దళితల అకౌంట్లోకి పది లక్షలు రూపాయలు ఇవ్వాలని సీఎం దళిత బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. ఈ పథకాన్ని రాజకీయ కోణంలో చూడవద్దన్న మంత్రి కమలాకర్.. పేదల బతుకుల్లో వెలుగులు చూడాలన్నారు. గతంలో రైతు బంధు కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించామని, అలాంటి గొప్ప పథకాన్ని మళ్లీ ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించామని కమలాకర్ పేర్కొన్నారు.

‘90 రూపాయల గడియారానికి ఆశపడి కేసీఆర్‌కు అన్యాయం చేయొద్దు. పాదయాత్ర ఎందుకోసమో ఈటలను నిలదీయండి. గడియారాలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ప్రజలు కోరుకున్న ఎన్నికలు కావు. IAS అధికారులు గ్రామ గ్రామానికి వచ్చి అర్హులైన దళితులకు ‘దళిత బంధు’ చెక్కులు అందిస్తారు. ప్రభుత్వోద్యోగులున్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు’ అని కమలాకర్ స్పష్టం చేశారు.

Read Also… తొలి రోజే.. ‘పెగాసస్’ పై లోక్ సభలో రభస.. మంత్రివర్గ సహచరులను పరిచయం చేయలేకపోయిన ప్రధాని.. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా..