Telangana: అర్థరాత్రి గ్రామ శివారు నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూసేందుకు వెళ్లగా…

|

Sep 25, 2022 | 1:53 PM

రాత్రి పూట శివార్లోని పొలాల్లో తవ్వకాలు.. ఏవో పూజలు. సెటప్ అంతా చూసిన స్థానికులు.. వారు క్షుద్ర పూజలు చేశారని అనుకున్నారు. ఈ తంతుకు పాల్పడిన వారందర్నీ చితకబాదారు.

Telangana: అర్థరాత్రి గ్రామ శివారు నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూసేందుకు వెళ్లగా...
Excavation For Hidden treasure
Follow us on

Treasure Hunt: చదువుకునేవారు పెరుగుతున్న కొద్దీ మూర్ఖులు కూడా పెరగడం ఆశ్చర్యంగా ఉంది. జనాల్ని భయకంపితులు చేసిన కరోనా(Coronavirus)కు మెడిసిన్ కనిపెట్టం.. స్పేస్‌లో అద్భుతాలు చేస్తున్నాం. కానీ కొందరి నుంచి ఈ మూఢ నమ్మకాలు, పిచ్చి నమ్మకాలు మాత్రం దూరం అవ్వట్లేదు. ఎవడో వచ్చి ఈ యంత్రం ఇంట్లో ఉంటే కోటీశ్వర్లు అవుతారంటే.. వెంటనే నమ్మేస్తారు. ఫేక్ స్వామీజీ గుప్త నిధులు ఉన్నాయని చెబితే ఇంట్లోనే తవ్వకాలు జరుపుతారు. కలిసి వస్తుందని చెప్తే.. నరబలులు ఇచ్చే మానసిక వికలాంగులు సైతం ఉన్నారు ప్రజంట్ సొసైటీలో. ఇక క్షుద్ర పూజలు, గుప్త నిధులు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ. ఇలాంటి మోసాల గురించి రోజూ ఘటనలు వెలుగుచూస్తేనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్​ జిల్లా( vikarabad district)లోనూ ఇలాంటి ఇన్సిడెంట్ వెలుగుచూసింది. పరిగి మండలం సుల్తాన్​పూర్‌లో.. తులసీరాం నాయక్​ అనే వ్యక్తి తన సొంత పొలంలో అర్థరాత్రి పూట ఏవో పూజలు చేయడాన్ని స్థానికులు గమనించారు. అతడితో పాటు ఇద్దరు మాంత్రికులు సైతం ఉన్నారు. దీంతో క్షుద్ర పూజలుగా భావించి.. వారందర్నీ చితకబాదారు. వాస్తవానికి వారు అక్కడ గుప్త నిధులు కోసం తవ్వకాలు జరుపుతున్నారు. కాగా తులసీరాం నాయక్​‌పై దాడిని అడ్డుకోడానికి వచ్చిన.. అతడి కుటుంబ సభ్యుల్ని సైతం తండా వాసులు చితకబాదారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన వారిని వ్యక్తులను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో పూజా సామగ్రిని, రెండు బైకులు, కారును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..