Rain Alert: తెలుగు ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

|

Aug 22, 2023 | 2:51 PM

హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాలకు వర్షసూచన. మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ పది జిల్లాలకు అధికారులు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ను జారీ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి పలు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. రేపు, ఎల్లుండి కూడా హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మంగళవారం...

Rain Alert: తెలుగు ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Telangana Rains
Follow us on

తెలంగాణకు వాతావరణ శాఖ మళ్లీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకూ బలమైన గాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తెలంగాణలోని ములుగు, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఇక హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాలకు వర్షసూచన. మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ పది జిల్లాలకు అధికారులు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ను జారీ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి పలు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. రేపు, ఎల్లుండి కూడా హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి, కోఠి, మలక్‌పేట్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, లక్డికపూల్‌, మెహిదీపట్నం, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్‌, హిమాయత్‌నగర్‌లో తేలికపాటి వర్షం కురిసింది.

ఏపీకి కూడా వర్ష సూచన..

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాలో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అల్టర్ జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..