జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)కు వరద నీరు పోటెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లోకి రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్‌ఫ్లో 18,52,390 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 18,52,390 క్యూసెక్కులగా ఉంది. వరద ప్రవాహ ఉధృతి నేపథ్యంలో 85 గేట్లు ఓపెన్ చేసి నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు. అర్ధరాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంతంలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. రామన్నగూడెం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరద ప్రవాహంతో వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో 30కి గ్రామాలు జలదిగ్బంధం. గోదావరి పరివాహక గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. రాత్రంతా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి