School Holiday Today: విద్యార్ధులకు అలర్ట్.. ఈ రోజు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! కారణం ఇదే

 Medaram Sammakka-Saralamma Jathara Holiday on January 30: బుధవారం సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెకు చేరుకుంది. ఇక ఈ రోజు సారక్క రానుంది. ఈ క్రమంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షల్లో భక్తులు పోటెత్తనున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున స్థానిక ప్రాముఖ్యత దృష్ట్యా..

School Holiday Today: విద్యార్ధులకు అలర్ట్.. ఈ రోజు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! కారణం ఇదే
School Holiday On January 30

Updated on: Jan 30, 2026 | 7:23 AM

ములుగు, జనవరి 30: ‘తెలంగాణ కుంభమేళా’ గా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 4 వేల బస్సులను నడుపుతుంది. మరోవైపు పస్రా నుంచి మేడారం వరకు భక్తులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు సర్కార్ శుభవార్త చెప్పింది. బుధవారం సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెకు చేరుకుంది. ఇక ఈ రోజు సారక్క రానుంది. ఈ క్రమంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షల్లో భక్తులు పోటెత్తనున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున స్థానిక ప్రాముఖ్యత దృష్ట్యా ములుగు జిల్లా యంత్రాంగం ఈ రోజు ప్రత్యేక సెలవుదినంగా ప్రకటించింది. అంటే జనవరి 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిందన్న మాట.

జిల్లా కలెక్టర్ జనవరి 30 (శుక్రవారం) జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తిస్తుంది. దీనికి బదులుగా సాధారణంగా సెలవుదినం అయిన ఫిబ్రవరి 14 నెలలోని రెండవ శనివారం నాడు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ఉత్తర్వుల్లో కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వరంగల్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మహిళలు, పురుషులు అందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇందుకోసం పస్రా వద్ద నుంచి 20 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల ద్వారా బుధవారం నాటికి సుమారు 80 లక్షల మంది భక్తులను మేడారం చేర్చినట్లు ఆర్టీసీ వరంగల్ ప్రకటించింది. కాగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు 4000కు పైగా బస్సులను ఆర్టీసీ నడపనుంది. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా ‘మేడారం విత్ ఆర్టీసీ’ యాప్ కూడా జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.