Medaram Jatara 2022: అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అతిపెద్ద గిరిజన జాతర మేడారం(Medaram) సమ్మక్క సారలమ్మ జాతర(Medaram Jatara) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. అయితే, ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మలను(Mulugu) దర్శించుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి వస్తున్నారు. ఇదిలాంటే.. మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు.. అమ్మవార్లకు మొక్కలు చెల్లించిన తరువాత మేక, కోడి సహా ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే వేస్తున్నారు. అడవిలో చెట్ల మీద, గుడి ఆవరణలో ఇష్టారీతిన వ్యర్థాలను పడేస్తున్నారు. ఇప్పుడిదే పెద్ద సమస్యగా మారింది.
భక్తులకు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి..
ఈ పరిస్థితిని గమనించిన ములుగు(Mulugu) ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka).. భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన తరువాత మేక, కోడి సహా ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ అడవిలో చెట్ల మీద కానీ గుడి ఆవరణలో పడేయకండని నమస్కరించి మరీ విజ్ఞప్తి చేశారు. ఆ వ్యర్థాల కారణంగా తరువాత వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. జాతర ముగిసిన తరువాత ఈ వ్యర్థాల కారణంగా చుట్టు పక్కల గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, కలరా వంటి విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందని భక్తులకు సూచించారు. ఈ నేపథ్యంలో వ్యర్థాలను చెత్త కుండీల్లో మాత్రమే వేయాలని, పరిశుభ్రతను పాటించి.. గిరిజన ప్రజలు వ్యాధుల బారిన పడుకుండా సహకరించాలని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు.
సవాల్‌గా పారిశుద్ధ్య నిర్వహణ..
మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. కారణం భక్తుల నిర్లక్ష్యమే అని అధికారులు వాపోతున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు దుర్గంధంగా మారాయని అంటున్నారు. ఈ వ్యర్థాల కారణంగా ఈగలు, దోమలు సైతం విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Ghani Song Launch : వరుణ్ తేజ్ గని సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్
Vijay’s Beast: ప్రమోషన్స్ షురూ చేసిన బీస్ట్ టీమ్.. అరబిక్ సాంగ్‌తో అదరగొట్టనున్న అనిరుద్