Allegations on Etala: మంత్రి ఈటల భూముల్లో కొనసాగుతున్న విచారణ… అసైన్డ్ భూముల ఆక్రమణ నిజమేః మెదక్ జిల్లా కలెక్టర్

|

May 01, 2021 | 12:44 PM

మంత్రి ఈటల రాజేందర్ భూవివాదానికి సంబంధించి అధికారుల విచారణ ముమ్మరం చేశారు. అచ్చంపేటలో బాధిత రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

Allegations on Etala: మంత్రి ఈటల భూముల్లో కొనసాగుతున్న విచారణ... అసైన్డ్ భూముల ఆక్రమణ నిజమేః మెదక్ జిల్లా కలెక్టర్
Medak Collector Harish On Minister Etala Rajendar Allegations
Follow us on

Allegations on Etala Rajendar: మంత్రి ఈటల రాజేందర్ భూవివాదానికి సంబంధించి అధికారుల విచారణ ముమ్మరం చేశారు. అచ్చంపేటలో బాధిత రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని రెవిన్యూ అధికారులు హామీ ఇస్తున్నారు. దీంతో బాధిత రైతులు ఒక్కొక్కరుగా స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. తమ భూమిలో మంత్రి ఈటల రాజేందర్ పరిశ్రమ పెట్టారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు సర్వే చేయించి హద్దు రాళ్లు వేయించినా.. మంత్రి అనుచరులు వాటిని తొలగించి నిర్మాణాలు చేపట్టారని తమ దగ్గరున్న ఆధారాలు అందజేస్తున్నారు.

అసైన్డ్ భూముల ఆక్రమణ నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తేల్చి చెప్పారు. ఆరోపణలు వచ్చిన భూముల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ విచారణ చేపట్టారు. బాధితులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమని తేలిందని టీవీ9తో చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఈటలపై ఏ క్షణమైనా ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయి.

ఈటలపై ఆరోపణల నేపథ్యంలో ఆరు ప్రత్యేక బృందాలు భూముల సర్వే చేస్తున్నాయి. అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో రెవిన్యూ అధికారుల బృందం భూములను సర్వే చేస్తున్నారు. జమునా హెచరీస్‌లో డిజిటల్ సర్వే కొనసాగుతోంది. దీంతో పక్కనే ఉన్న అసైన్డ్ ల్యాండ్స్‌లో అధికారులు సర్వే చేపట్టారు.

అయితే తన వివరణ తీసుకోకుండా సీఎం ఆదేశాలివ్వడం బాధాకరమన్నారు మంత్రి ఈటల రాజేందర్. తనపై కుట్ర జరుగుతోందన్నారు. కుట్ర చేస్తున్నవారెవరో త్వరలోనే బయటపడుతుందన్నారు. 100 కోట్ల రూపాయలు పోయినా ఈటల రాజేందర్‌ భయపడడు.. కార్యకర్తలు, అభిమానులు తొందరపడొద్దన్నారాయన. మూడు రోజులుగా కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. అందుబాటులోకి రావడం లేదని ఆరోపించారు.

Read Also….  Etela Rajender: వివరణ తీసుకోకుండా విచారణకు ఆదేశించారు.. కుట్ర చేస్తున్నదెవరో త్వరలో బయట పడుతుందన్న ఈటల